రోడ్డు ధ్వంసం చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టండి.. నష్టాన్ని వారి నుంచే వసూలు చేయండి: పవన్ కల్యాణ్
- తిరుపతి జిల్లాలో కొత్తగా వేసిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటన
- వైసీపీ నేత సుబ్బారెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదుకు పవన్ ఆదేశం
- నష్టాన్ని నిందితుల నుంచే వసూలు చేయాలని అధికారులకు సూచన
- ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం క్షమించరాని నేరమన్న డిప్యూటీ సీఎం
- ‘పల్లె పండుగ 3.0’ కింద వారం క్రితమే రోడ్డు నిర్మాణం
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని, వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా, పుల్లంపేట మండలం అనంతసముద్రం-పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య కొత్తగా నిర్మించిన రోడ్డును వైసీపీ నేత ధ్వంసం చేసిన ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని, ధ్వంసమైన రోడ్డుకు అయిన ఖర్చును వారి నుంచే వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు.
‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల క్రితమే రూ.4.75 కోట్ల వ్యయంతో ఈ గ్రావెల్ రోడ్డును నిర్మించారు. అయితే, వైసీపీకి చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి, వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి సహాయంతో ట్రాక్టర్‌తో రోడ్డును దున్ని సుమారు 100 మీటర్ల మేర ధ్వంసం చేశారు. గ్రామస్థులు అందించిన సమాచారంతో అధికారులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సోమవారం ఈ విషయంపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ప్రజల సౌకర్యార్థం ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని ఆయన అన్నారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వైసీపీ నేత సుబ్బారెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ధ్వంసం వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసి, నిందితులపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించి ఆ మొత్తాన్ని వారి నుంచే రాబట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడిన వ్యక్తులతో పాటు వారి వెనుక ఉన్న శక్తులను కూడా చట్టం ముందు నిలబెట్టాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. నిందితులను ఈరోజు సాయంత్రంలోగా అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని అధికారులు ఉప డిప్యూటీ సీఎంకు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే వారి వివరాలను ప్రజలందరికీ తెలిసేలా బహిర్గతం చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు.