తెలంగాణకు రేపటి నుంచి వర్ష సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Advertisement
- ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలుల హెచ్చరిక
- ఉత్తర తమిళనాడు తీరంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- హైదరాబాద్ సహా అనేక జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ
Advertisement
తెలంగాణలో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేసింది.
ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
రేపు (అక్టోబర్ 18) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.