బిస్కెట్ల తయారీలో పశువుల దాణా.. తయారీ సంస్థపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు!
- ప్రియగోల్డ్ బిస్కెట్లలో పశువుల దాణా వాడినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆరోపణ
- తయారీ సంస్థ సూర్య ఫుడ్ అండ్ ఆగ్రోపై ప్రాసిక్యూషన్‌కు ఆదేశం
- తనిఖీల్లో పరిశుభ్రతా లోపాలు, ఇతర ఉల్లంఘనలు గుర్తింపు
- ఇప్పటికే కంపెనీ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్‌ను రద్దు చేసిన అధికారులు
- దొడ్ల డెయిరీతో సహా పలు సంస్థలపైనా చర్యలు తీసుకున్న ఎఫ్ఎస్ఎస్ఏఐ
దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన 'ప్రియగోల్డ్' బిస్కెట్ల తయారీలో పశువుల దాణా వినియోగిస్తున్నట్లు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సంచలన ప్రకటన చేసింది. ఈ తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు గాను, ప్రియగోల్డ్ తయారీ సంస్థ అయిన 'సూర్య ఫుడ్ అండ్ ఆగ్రో లిమిటెడ్'పై ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసినట్లు శనివారం వెల్లడించింది.
ఒక వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు సూర్య ఫుడ్ అండ్ ఆగ్రో కంపెనీ తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో, 'పశువుల దాణాకు మాత్రమే ఉద్దేశించినది' అని స్పష్టంగా రాసి ఉన్న తవుడు బస్తాలను అధికారులు కనుగొన్నారు. మనుషుల వినియోగానికి ఏమాత్రం పనికిరాని ఈ తవుడును, బిస్కెట్లలో ఫైబర్ (పీచుపదార్థం) కోసం ముడిసరుకుగా వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ ఆరోపణలతో పాటు, సదరు పరిశ్రమలో మరిన్ని లోపాలు ఉన్నట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తమ ప్రకటనలో పేర్కొంది. పరిశ్రమ ప్రాంగణంలో అపరిశుభ్రత, పురుగుల నివారణ చర్యలు చేపట్టకపోవడం, ముడిసరుకుల నిల్వలో నిర్లక్ష్యం, సిబ్బంది వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం వంటి అనేక ఉల్లంఘనలను గుర్తించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో, కంపెనీ ఫుడ్ సేఫ్టీ లైసెన్స్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశామని, తాజాగా క్రిమినల్ చర్యల్లో భాగంగా ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చామని వివరించింది.
సాధారణంగా ధాన్యాల పైపొర అయిన తవుడును ఆహారంలో ఫైబర్ కోసం వాడుతుంటారు. అయితే, మనుషుల కోసం వాడే 'ఫుడ్-గ్రేడ్' ముడిపదార్థాలకు, పశువుల దాణాకు నాణ్యత, భద్రతా ప్రమాణాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. పశువుల దాణాగా నిర్దేశించిన పదార్థాలను మనుషుల ఆహారంలో కలపడం చట్టరీత్యా తీవ్రమైన నేరం.
ఈ చర్యలు కేవలం ప్రియగోల్డ్ సంస్థకే పరిమితం కాలేదు. ఫుల్ క్రీమ్ మిల్క్ శాంపిల్‌లో డిటర్జెంట్ అవశేషాలు గుర్తించినందుకు 'దొడ్ల డెయిరీ'పై, ఎండు ద్రాక్షలో పురుగుమందులు అవశేషాలు ఉన్నందుకు యూఈఐఆర్ ఆర్గానిక్ ఫుడ్స్‌పై కూడా ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది.
అయితే, ఏయే ప్రియగోల్డ్ బిస్కెట్ వేరియంట్లలో ఈ ఉల్లంఘనలు జరిగాయి, ఏ బ్యాచ్‌లకు ఇది వర్తిస్తుంది అనే వివరాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించలేదు. అలాగే, దేశవ్యాప్తంగా ఆ బిస్కెట్లను వెనక్కి తీసుకోవాలని (రీకాల్) కూడా ఇప్పటి వరకు ఆదేశాలు జారీ చేయలేదు. ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజా ఆరోపణలపై సూర్య ఫుడ్ అండ్ ఆగ్రో సంస్థ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.