'విజయ్ నటనకు నేను ఫ్యాన్.. ఎప్పటికీ అలాగే ఉంటాను'.. 'రణబాలి'పై రష్మిక ఎమోషనల్ పోస్ట్
Advertisement
- 'రణబాలి' చిత్రానికి వస్తున్న అద్భుత స్పందనపై సంతోషం వ్యక్తం చేసిన రష్మిక
- జయమ్మ పాత్ర ఒక నిజమైన మహిళ ఎలా ఉండాలో నేర్పిందని వెల్లడి
- దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ను గొప్ప కథకుడిగా అభివర్ణించిన నటి
- ఐక్యత, నమ్మకాలే 'రణబాలి' సినిమా కథాంశమని స్పష్టం చేసిన హీరోయిన్
Advertisement
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ డ్రామా 'రణబాలి' ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ఈ నేపథ్యంలో నటి రష్మిక మందన్న ఈ చిత్రం విజయం పట్ల, తన భర్త విజయ్ నటన పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన, ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. విజయ్ నటనకు తాను ఎప్పటినుంచో అభిమానినని, భవిష్యత్తులోనూ అభిమానిగానే కొనసాగుతానని ఆమె తన మనసులోని మాటను పంచుకున్నారు.
ఈ చిత్రంలో తాను పోషించిన 'జయమ్మ' పాత్ర గురించి రష్మిక ప్రత్యేకంగా ప్రస్తావించారు. "జయమ్మ.. ఆమె ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. ఒక నిజమైన మహిళ ఎలా ఉండాలో, తన వాళ్ల కోసం ఎలా నిలబడాలో, వారిని ఎలా కాపాడుకోవాలో ఆ పాత్ర నాకు నేర్పింది" అని రష్మిక పేర్కొన్నారు.
'రణబాలి' సినిమాకు, జయమ్మ పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రేమాభిమానాలకు తాను సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నానని తెలిపారు. ఈ చిత్రం ఓ సమాజంగా మనకున్న బలాన్ని, దేవుడిపై మనకున్న నమ్మకాన్ని, కష్టకాలంలోనూ చిన్న చిన్న విషయాలను వేడుక చేసుకునే మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆమె వివరించారు.
'రణబాలి' కథాంశాన్ని వివరిస్తూ.. "బయటి నుంచి ఎవరైనా మన జోలికి వస్తే మనం చూస్తూ ఊరుకోం. మనమంతా కలిసి పోరాడతాం. అదే 'రణబాలి' కథ. ఒకే లక్ష్యం కోసం అందరం కలిసికట్టుగా చేసే పోరాటమే ఈ సినిమా" అని ఆమె స్పష్టం చేశారు.
తన భర్త విజయ్ దేవరకొండ నటనను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా రాసుకొచ్చారు. "@thedeverakonda - నీ నటనకు నేను అభిమానిని అని నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎప్పటికీ అభిమానిగానే ఉంటాను. ఈ రోజు నీ కష్టానికి, నటనకు అందరి నుంచి ప్రశంసలు వస్తుంటే చూడటానికి నాకెంతో సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంది. నీ విషయంలో నా మనసు చాలా హ్యాపీగా ఉంది" అంటూ విజయ్ విజయాన్ని తన విజయంగా భావిస్తూ రష్మిక చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకుంటున్నాయి.
అదే సమయంలో దర్శకుడు రాహుల్ సాంకృత్యన్పై కూడా రష్మిక ప్రశంసల వర్షం కురిపించారు. "మన దేశంలో ఉన్న అద్భుతమైన కథకులలో రాహుల్ ఒకరు. ఆయన కథ చెప్పే విధానం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఆయన కష్టానికి తగిన గుర్తింపు లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని ఆమె పేర్కొన్నారు.
ఈ సినిమాను తెరపైకి తీసుకురావడానికి కృషి చేసిన యావత్ చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు. చివరగా.. "సంపూర్ణ ప్రేమతో, మీ జయమ్మ!" అంటూ తన పోస్టును ముగించారు.