Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ ఒక 'అరుదైన పీస్'.. కేసులు తేలేవరకు రాజకీయాలకు దూరం ఉండాలి: సోమిరెడ్డి

YS Jagan Mohan Reddy rare piece in politics says TDP leader Somireddy Chandramohan Reddy
Advertisement
  • ఏ నాయకుడిపై లేనన్ని కేసులు జగన్ పై ఉన్నాయన్న సోమిరెడ్డి
  • తిరుమల ప్రసాదం కోసం కల్తీ నెయ్యి వాడారని మండిపాటు
  • అద్వానీని జగన్ ఆదర్శంగా తీసుకోవాలని హితవు
Advertisement
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లోనే జగన్ ఒక అరుదైన పీస్ అని వ్యాఖ్యానించారు. ఆయనపై నమోదైన కేసులు తేలేంత వరకు రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో ఏ ఇతర రాజకీయ నాయకుడిపై లేనన్ని సీబీఐ, ఈడీ కేసులు జగన్‌పై ఉన్నాయని సోమిరెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదం కోసం కల్తీ నెయ్యి వాడారని... అది పెద్ద పాపమని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ఈ కేసుల్లో సీబీఐ కోర్టు రోజువారీ విచారణ ప్రారంభించడాన్ని ఆయన ప్రస్తావించారు.

తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేసి రూ. 43,000 కోట్లు అక్రమంగా సంపాదించారనే ఆరోపణలు, కల్తీ నెయ్యి కేసులో రూ. 130 కోట్ల ఆస్తుల అటాచ్‌మెంట్, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రూ. 40 కోట్ల కోణంపై ఈడీ దర్యాప్తు వంటి అంశాలను సోమిరెడ్డి గుర్తుచేశారు. అంతేకాకుండా, రూ. 3,500 కోట్ల నకిలీ మద్యం కుంభకోణం వల్ల 30,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు.

బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, తనపై ఆరోపణలు వచ్చినప్పుడు కేసు తేలే వరకు పార్లమెంటు పదవికి రాజీనామా చేశారని సోమిరెడ్డి ఉదహరించారు. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే, అదే విధంగా విచారణ ముగిసేంత వరకు రాజకీయాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. కేసుల్లో వందలాది మంది సాక్షులు ఉన్నందున జగన్ రోజూ కోర్టుకు హాజరు కావాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement
YS Jagan Mohan Reddy
Somireddy Chandramohan Reddy
TDP vs YSRCP
Andhra Pradesh Politics
CBI ED Cases
Tirumala Ghee Controversy

More Telugu News