వైఎస్ అవినాశ్ రెడ్డికి నోటీసులు అందించిన పులివెందుల పోలీసులు
- పులివెందులలోని పార్టీ కార్యాలయంలో నోటీసుల అందజేత
- ర్యాలీలు, నిరసనలు నిర్వహించవద్దని నోటీసులో స్పష్టం చేసిన పోలీసులు
- స్థానిక ఎన్నికల నేపథ్యంలో సెక్షన్ 144 అమల్లో ఉందన్న పోలీసులు
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పులివెందులలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని, ఈ క్రమంలో ఎలాంటి ర్యాలీలు, సభలు, నిరసనలు చేపట్టవద్దని ఆ నోటీసులో పోలీసులు స్పష్టం చేశారు.
ఈ ఉదయం పులివెందుల టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం రాజు స్థానిక వైసీపీ కార్యాలయంలో అవినాశ్ రెడ్డిని కలిసి ఈ నోటీసును అందజేశారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీసులు కోరారు.
స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా చూడటంలో భాగంగానే ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని... ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.