ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడిన వాహనం, 8 మంది మృతి!
- రాజస్థాన్లో బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి
- మృతుల్లో ఐదుగురు మహిళలు, మరో 17 మందికి గాయాలు
- భోపాల్ నుంచి ఖాటూ శ్యామ్కు వెళ్తుండగా ప్రమాదం
- డ్రైవర్ నిద్ర మత్తుతో బస్సు అదుపు తప్పినట్లు ప్రాథమిక సమాచారం
- క్షతగాత్రులకు కోటాలోని రెండు ఆసుపత్రుల్లో చికిత్స
ఢిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్వేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. రాజస్థాన్లోని కోటా సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
పోలీసుల సమాచారం ప్రకారం.. బస్సులో 27 మంది ప్రయాణిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ నుంచి రాజస్థాన్లోని ఖాటూ శ్యామ్ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే బస్సు అదుపు తప్పింది. రక్షణ కంచెను ఢీకొట్టి లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో మరణించిన ఎనిమిది మందిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో గాయపడిన 17 మందిని కోటాలోని ఎంబీఎస్ ఆసుపత్రి, న్యూ మెడికల్ కాలేజీ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎవరి పరిస్థితీ విషమంగా లేదని అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం ఉదయం 8 గంటల సమయంలో అందినట్లు వెల్లడించారు.
కోటా జిల్లా కలెక్టర్ పీయూష్ సమారియా, ఐజీ హరేంద్ర మహావర్ ఎంబీఎస్ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అందుబాటులో ఉన్న నాలుగు అంబులెన్సులనూ ప్రమాద స్థలానికి పంపించారు. క్షతగాత్రులను వీలైనంత త్వరగా ఆసుపత్రులకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.