బీఆర్ఎస్ ఆస్తుల చిట్టా: రూ.1509 కోట్ల ఆస్తులు.. కానీ ఖర్చే ఎక్కువ!
- బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే రూ.1431 కోట్ల నిధులు
- ఆదాయం రూ.114 కోట్లు, ఖర్చు రూ.162 కోట్లు
- ఆదాయం కంటే రూ.48 కోట్లు పెరిగిన ఖర్చులు
- ప్రచార కార్యక్రమాల కోసం రూ.137 కోట్ల భారీ వ్యయం
- తగ్గిన పార్టీ జనరల్ ఫండ్.. ఈసీకి ఆడిట్ నివేదిక
పదేళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న 'భారత రాష్ట్ర సమితి' (బీఆర్ఎస్) ఆర్థిక వ్యవహారాలు ఆసక్తికరంగా మారాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పార్టీ సమర్పించిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారం మొత్తం ఆస్తులు రూ.1,509 కోట్లుగా ఉండగా.. అదే ఏడాది ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా నమోదైంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఈ నివేదిక, పార్టీ ఆర్థిక వనరులు, వ్యయాలపై స్పష్టమైన చిత్రాన్ని ఆవిష్కరించింది.
ఆడిట్ రిపోర్ట్ ప్రకారం.. 2026 మార్చి 31 నాటికి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.1,509 కోట్లు. ఇందులో సింహభాగం, అంటే రూ.1,431 కోట్లు బ్యాంకుల్లో నగదు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. వీటిలో రూ.1,237 కోట్లు ఏడాదికి పైబడిన కాలపరిమితి కలిగిన దీర్ఘకాలిక డిపాజిట్లు కావడం గమనార్హం.
భవనాలు, ఇతర భౌతిక ఆస్తుల విలువ రూ.66.26 కోట్లుగా, రుణాలు, అడ్వాన్సుల రూపంలో మరో రూ.11.77 కోట్లు ఉన్నట్లు పార్టీ తన నివేదికలో వెల్లడించింది.
ఇక పార్టీ ఆదాయ, వ్యయాల వివరాలను పరిశీలిస్తే, 2025-26లో బీఆర్ఎస్కు వివిధ మార్గాల ద్వారా రూ.114 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో విరాళాల ద్వారా రూ.16.44 కోట్లు రాగా, డిపాజిట్లపై వడ్డీ, అద్దెలు, ఇతర మార్గాల నుంచి ఏకంగా రూ.97.76 కోట్లు సమకూరాయి.
అంటే పార్టీ ప్రధాన ఆదాయ వనరుగా బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ నిలుస్తోంది. అయితే, ఇదే ఆర్థిక సంవత్సరంలో పార్టీ ఖర్చు రూ.162 కోట్లుగా నమోదైంది. దీంతో ఆదాయానికి మించి రూ.48.43 కోట్ల మేర ఖర్చు అధికంగా ఉంది. ఈ కారణంగా పార్టీ జనరల్ ఫండ్ రూ.1,551 కోట్ల నుంచి రూ.1,503 కోట్లకు తగ్గింది.
మొత్తం ఖర్చులో అధిక భాగం ప్రచార కార్యక్రమాలకే కేటాయించారు. సాధారణ ప్రచార కార్యకలాపాల కోసం రూ.137 కోట్లు వెచ్చించగా, ఇందులో బహిరంగ సభల నిర్వహణకు రూ.57.51 కోట్లు, పత్రికలు, టీవీ ప్రకటనలకు రూ.53.68 కోట్లు ఖర్చు చేశారు. పరిపాలన, సాధారణ ఖర్చుల కింద రూ.16.88 కోట్లు వెచ్చించగా, అందులో న్యాయ సేవల కోసమే రూ.13.39 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం.
వీటితో పాటు గతేడాది నవంబర్లో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రత్యేకంగా రూ.1.60 కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ వద్ద భారీగా ఆస్తులు ఉన్నప్పటికీ, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయాన్ని మించి ఖర్చులు చేయడం ఈ నివేదికలో ప్రధానాంశంగా నిలిచింది.