పోలీస్‌ యూనిఫామ్‌లో డ్యాన్స్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీస్‌ యూనిఫామ్‌లో డ్యాన్స్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్

CV Anand warns of strict action against police dancing in uniform
  • ప్రైవేట్, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఆంక్షలు
  • సోషల్ మీడియాలో పోలీసుల డ్యాన్స్ వీడియోలు వైరల్ కావడంతో ఈ నిర్ణయం
  • యూనిఫామ్ గౌరవాన్ని కాపాడాలని సిబ్బందికి సీవీ ఆనంద్ సూచన
తెలంగాణలో పోలీస్ సిబ్బంది యూనిఫామ్‌లో డ్యాన్సులు చేయడంపై రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. ఇకపై యూనిఫామ్‌ ధరించి వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నా, డ్యాన్సులు చేసినా కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన శుక్రవారం హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ యూనిట్ల అధిపతులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల కాలంలో పలువురు పోలీసు సిబ్బంది, అధికారులు పండుగలు, ప్రైవేట్ కార్యక్రమాల్లో యూనిఫామ్‌లోనే డ్యాన్సులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గణేశ్ నిమజ్జనం, మేడారం జాతర, వీడ్కోలు సమావేశాలు వంటి సందర్భాల్లో జరిగిన ఈ ఘటనలు పోలీసు శాఖ క్రమశిక్షణపై ప్రజా విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో డీజీపీ తాజా ఆదేశాలు జారీ చేశారు.

పోలీస్ యూనిఫామ్ అనేది బాధ్యత, అధికారం, క్రమశిక్షణకు ప్రతీక అని, దాని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డీజీపీ నొక్కిచెప్పారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడటం సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేశారు.

Advertisement
CV Anand
Telangana Police
Police Uniform Discipline
Police Dancing Warning
Telangana DGP
Police Service Rules

More Telugu News