మిథున్ రెడ్డి కాన్వాయ్‌లో రౌడీషీటర్లు ఉన్నారు: పుంగనూరు ఘటనపై డీఐజీ సంచలన వ్యాఖ్యలు
- పుంగనూరులో మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి
- నామినేషన్ కేంద్రం గేట్లను ఢీకొని లోపలకు వచ్చారన్న డీఐజీ
- 13 మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని వెల్లడి
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల తొలిరోజే పుంగనూరులో చెలరేగిన హింసకు సంబంధించి కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కీలక విషయాలు వెల్లడించారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాల్లో పలువురు రౌడీషీటర్లు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
పుంగనూరు, రాయచోటిలో మీడియాతో మాట్లాడిన డీఐజీ, ఘటన వివరాలను తెలిపారు. "ఉదయం 9 గంటలకు ఎంపీ కాన్వాయ్ వచ్చింది. టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా నామినేషన్ కేంద్రం గేట్లను ఢీకొట్టి బలవంతంగా లోపలికి ప్రవేశించారు. ఈ క్రమంలోనే రాళ్ల దాడి, ఘర్షణలు జరిగాయి" అని వివరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు డీఎస్పీ ప్రసాద్ గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరపాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
కాన్వాయ్‌లోని వాహనాల్లో ఉన్న కె. సాయికుమార్ రెడ్డి, కె. జస్వంత్, షేక్ ఇస్మాయిల్, పుట్ట వంశీకృష్ణ వంటి రౌడీషీటర్లు మారణాయుధాలతో దాడి చేశారని డీఐజీ తెలిపారు. రాళ్లదాడి, ఘర్షణలు జరగడంతో పోలీసులు ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో డీఎస్పీ ప్రసాద్ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు చేశారు. ఎస్పీ ధీరజ్ మిథున్ రెడ్డిని వాహనంలో ఎక్కించుకుని సురక్షితంగా పుంగనూరు పట్టణం దాటించారు.
నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో కారు ఢీకొట్టడంతో కిందపడి గాయపడిన సొహైల్ బాషా, మధు రాయల్, పెద్ద మోహన్ నాయుడు, డీఎస్పీ ప్రసాద్ తదితరుల ఫిర్యాదుతో మూడు కేసులు నమోదు చేశామని తెలిపారు. మొత్తం 13 మంది తెదేపా కార్యకర్తలు గాయపడ్డారని వెల్లడించారు.