అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి: మోదీకి ఖర్గే లేఖ
- కొత్త బిల్లులపై చర్చ పెట్టాలని డిమాండ్
- గతంలో డీలిమిటేషన్ బిల్లు వీగిపోయిన వైనం ప్రస్తావన
- అఖిలపక్షం కోసం విజ్ఞప్తి చేయడం ఇది నాలుగోసారని వెల్లడి
- పార్లమెంట్ సమావేశాలు ప్రొరోగ్ కాకపోవడంపై ఆందోళన
కొత్త బిల్లులు, కీలక ప్రతిపాదనలపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ ప్రతిపాదనలను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే వాటిపై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.
ఈ ఏడాది ఏప్రిల్ 17న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించలేక వీగిపోయిన విషయాన్ని ఖర్గే తన లేఖలో గుర్తుచేశారు. దేశంపై తీవ్ర ప్రభావం చూపే ఇటువంటి రాజ్యాంగ సవరణ బిల్లులను మరోసారి పార్లమెంటులో ఏకపక్షంగా 'బుల్డోజ్' చేయవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు.
అఖిలపక్ష సమావేశం కోసం తాను విజ్ఞప్తి చేయడం ఇది నాలుగోసారి అని ఖర్గే తెలిపారు. గతంలో ఏప్రిల్ 11, జులై 16, ఆగస్టు 27 తేదీల్లో కూడా సమావేశం నిర్వహించాలని తాను కోరినట్లు ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ఆగస్టు 13న వర్షాకాల సమావేశాలు వాయిదా పడిన 64 రోజుల తర్వాత కూడా ఉభయ సభలను ఇంకా ప్రొరోగ్ చేయలేదని, గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని అని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, 2026 ఏప్రిల్ 16న కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లుతో పాటు మరో రెండు బిల్లులు మరుసటి రోజే తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.