జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక నామినేషన్ కేంద్రాలు: వైసీపీ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
- జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైసీపీ అభ్యర్థన
- నామినేషన్ల ప్రక్రియ స్వేచ్ఛగా జరగాలంటున్న పిటిషనర్
- కేవలం అనుమానాలతో ఆదేశాలివ్వలేమన్న ఈసీ, ప్రభుత్వం
- ఇతర రెండు పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ఎన్నికల అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. బుధవారం ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వీరా రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సాధారణ నామినేషన్ కేంద్రాలు సరిపోవని, అభ్యర్థుల భద్రత దృష్ట్యా ప్రతి జిల్లా కేంద్రంలో అదనపు కేంద్రాలు అవసరమని కోర్టుకు విన్నవించారు. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం సమర్పించినా ఎలాంటి స్పందన రాలేదని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాల శ్రీనివాస్, ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. నామినేషన్ల దాఖలుకు మూడు రోజుల సమయం ఉంటుందని, ఎవరైనా అడ్డుకుంటే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉందని తెలిపారు. కేవలం అనుమానాల ప్రాతిపదికన న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయలేదని వారు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రాల్లో నామినేషన్ కేంద్రాల ఏర్పాటు అనేది ఎన్నికల అధికారి విచక్షణకు లోబడి ఉంటుందని, ప్రస్తుత నిబంధనల్లో దానికి అవకాశం లేదని వివరించారు. ఇప్పటికే నామినేషన్, పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కోర్టుకు నివేదించారు.
ఇదే సమయంలో, స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని, కుల ధ్రువీకరణ, నిరభ్యంతర పత్రాలను సకాలంలో జారీ చేయాలని కోరుతూ వైసీపీ దాఖలు చేసిన మరో రెండు పిటిషన్లపై విచారణను జస్టిస్ వి. సుజాత గురువారానికి వాయిదా వేశారు.