రైతులకు మంచి చేస్తుంటే జగన్‌కు కడుపుమంట: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
- రైతుల సంక్షేమం చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శ
- జగన్ ఎగ్గొట్టిన రూ.1700 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించామన్న ఏలూరి
- కూటమి ప్రభుత్వంలో రైతులకు మద్దతు ధర, ఇన్‌పుట్ సబ్సిడీ
- సీహెచ్‌సీల నిధులు దారి మళ్లించి జగన్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ
- తప్పుడు ప్రచారాలతో రైతులను మోసం చేయలేరని హితవు
రాష్ట్రంలో రైతులకు మేలు జరుగుతుంటే మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఓర్వలేకపోతున్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాతలకు అండగా నిలుస్తుంటే, ఆ సంక్షేమన్ని చూసి జగన్ అసూయతో రగిలిపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ.. "ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తూ సీఎం చంద్రబాబు రైతాంగానికి దన్నుగా నిలుస్తున్నారు. కందులు, మినుములు, టమోటా, పత్తి, పొగాకు వంటి వివిధ పంటలకు రూ.800 కోట్ల మేర మద్దతు ధర కల్పించి ఆదుకున్నాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1,944.43 కోట్లతో 1,50,747 మంది రైతుల నుంచి 2.84 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించింది" అని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన జాప్యాన్ని ప్రస్తావిస్తూ.. "వైసీపీ హయాంలో రూ.1,700 కోట్ల ధాన్యం కొనుగోలు నిధులను చెల్లించకుండా లక్ష మంది రైతుల పొట్టకొట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పెండింగ్ బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేసి వారిని ఆదుకుంది. ఈ రెండేళ్లలోనే రూ.1,078.34 కోట్ల విలువైన కందులు, రూ.617.69 కోట్ల విలువైన శనగలు, పెసలను ప్రభుత్వం కొనుగోలు చేసింది" అని తెలిపారు.
జగన్ పాలనలో జరిగిన అవకతవకలపై ఏలూరి తీవ్ర ఆరోపణలు చేశారు. "కస్టమ్ హైరింగ్ సెంటర్ల (CHC) పేరుతో జగన్ రెడ్డి రూ.367.38 కోట్ల నిధులను దారి మళ్లించి, వ్యవసాయ యంత్రాలను మాయం చేశారు. గొడ్డలి పార్టీకి రైతుల సంక్షేమం పట్టడం లేదు" అని విమర్శించారు.
కూటమి ప్రభుత్వ చర్యలను వివరిస్తూ.. "వరి పంట నష్టపరిహారాన్ని రూ.17,000 నుంచి రూ.25,000కు పెంచాం. రూ.310 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని 2 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసి అండగా నిలిచాం. రాబోయే ఖరీఫ్‌ను దృష్టిలో ఉంచుకొని 15 శాతం రివాల్వింగ్ ఫండ్, రూ.300 కోట్ల ధరల స్థిరీకరణ నిధి కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. వాస్తవాలను దాచిపెట్టి, తప్పుడు ప్రచారాలతో రైతులను మోసం చేయలేరని జగన్ గ్రహించాలి. రైతులను ఆదుకుని, వారికి భరోసా కల్పించింది కూటమి ప్రభుత్వమే" అని ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు.