Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు

Shamshabad Airport Ganja smuggling racket busted
Advertisement
  • శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత
  • గీజర్‌లో దాచి తరలిస్తున్న 7.750 కిలోల గంజాయి సీజ్
  • పట్టుబడ్డ గంజాయి విలువ రూ. 2.71 కోట్లు అని అంచనా
  • బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని అరెస్ట్ చేసిన డీఆర్ఐ
Advertisement
హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. ఎలక్ట్రిక్ గీజర్‌లో దాచి అక్రమంగా తరలిస్తున్న 7.750 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ. 2.71 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

పక్కా సమాచారం అందుకున్న డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు, అక్టోబర్ 12న బ్యాంకాక్ నుంచి వచ్చిన విమానంలో ప్రయాణించిన ఓ భారతీయుడిని అడ్డగించారు. అతని చెక్-ఇన్ బ్యాగేజీని తనిఖీ చేయగా, అందులో ఒక ఎలక్ట్రిక్ గీజర్ కనిపించింది. అనుమానంతో దాన్ని తెరిచి చూడగా, లోపల 73 ప్యాకెట్లలో పచ్చని పదార్థం బయటపడింది.

నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్‌తో పరీక్షించగా, అది గంజాయి అని నిర్ధారణ అయింది. దీంతో అధికారులు వెంటనే సదరు ప్రయాణికుడిని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) యాక్ట్, 1985 ప్రకారం అరెస్ట్ చేశారు. సరుకును మొత్తం సీజ్ చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అంతర్జాతీయ మార్గాల ద్వారా హైదరాబాద్‌కు అధిక నాణ్యత గల గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా ఈ పట్టివేత జరిగిందని అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్నందున నిందితుడి వివరాలను ఇంకా వెల్లడించలేదు.
Advertisement
Advertisement
Shamshabad Airport
DRI Hyderabad
Hydroponic Ganja
Drug Smuggling Hyderabad
Rajiv Gandhi International Airport

More Telugu News