Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిరసనలు ఆపొద్దు.. నేనున్నా.. యువతకు రాహుల్ గాంధీ పిలుపు

Rahul Gandhi calls youth to continue protests and promises support
Advertisement
  • రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడి
  • మోదీ, అమిత్ షా, భగవత్‌లను విలన్లుగా అభివర్ణించిన రాహుల్
  • అరెస్టులు చేసినా వెనక్కి తగ్గేది లేదని కేంద్రానికి సవాల్
  • ఢిల్లీలో నిరసనకారుల అరెస్టుల నేపథ్యంలో ఘాటు వ్యాఖ్యలు
Advertisement
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యువత తమ నిరసనలను కొనసాగించాలని, వారికి ప్రతిపక్షం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజ్యాంగంపై దాడి చేస్తున్న వారిని ఓడించి, దానిని కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. చెన్నైలో శనివారం జరిగిన "ఛాత్రోం కీ గూంజ్" విద్యార్థి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను పిరికిపందలుగా అభివర్ణించిన రాహుల్.. దశాబ్ద కాలంగా వారితో పోరాడుతున్నందున వారి తీరు తనకు బాగా తెలుసన్నారు. హోంమంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లను ఈ కథలో "విలన్లు" అంటూ ఘాటుగా విమర్శించారు. తమ పోరాటంతో వారికి అందుబాటులో ఉన్న అవకాశాలు తగ్గిపోతున్నాయని అన్నారు. "మేం మిమ్మల్ని చుట్టుముడుతున్నాం. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు" అని రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఎంతమంది పోలీసులను మోహరించినా, ప్రతిపక్ష నేతలను, యువతను అరెస్టు చేసినా తాము భయపడబోమని సవాల్ విసిరారు. ఈ మేరకు తన వ్యాఖ్యల వీడియోను 'ఎక్స్'ఖాతాలో పంచుకున్నారు.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రదర్శనకు అనుమతి లేదని, 3,000 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే, నిరసనకారులకు తన పార్టీ అండగా నిలుస్తుందని రాహుల్ స్పష్టం చేశారు.
Advertisement
Advertisement
Rahul Gandhi
Chatron Ki Goonj Chennai
Congress Youth Protest
Narendra Modi RSS Criticism
Election Commissioner Gnanesh Kumar
Jantar Mantar Delhi Protest

More Telugu News