Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆరాధన మిశ్రా.. బ్రాహ్మణ ఓట్లపై కాంగ్రెస్ గురి

Aradhana Misra appointed as UP PCC President Congress targets Brahmin votes
Advertisement
  • యూపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బ్రాహ్మణ నేత ఆరాధన మిశ్రా నియామకం
  • బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పాత వ్యూహం
  • 2017లోనూ ప్రశాంత్ కిశోర్ సలహాతో ఇదే ప్రయోగం విఫలం
Advertisement
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కీలక మార్పులు చేపట్టింది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా అజయ్ రాయ్ స్థానంలో బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ఆరాధన మిశ్రా మోనాను అధిష్ఠానం నియమించింది. రాష్ట్రంలో చేజారిన బ్రాహ్మణ ఓటు బ్యాంకును తిరిగి దక్కించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, దశాబ్దం క్రితం విఫలమైన పాత వ్యూహాన్నే కాంగ్రెస్ పునరావృతం చేస్తోందన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

గతంలో 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ ఇటువంటి వ్యూహాన్నే అనుసరించింది. అప్పటి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు, బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన షీలా దీక్షిత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దింపింది. రాష్ట్ర జనాభాలో దాదాపు 10 నుంచి 12 శాతం ఉన్న బ్రాహ్మణ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటే పార్టీకి పూర్వవైభవం లభిస్తుందని అప్పట్లో అంచనా వేసింది. అయితే, ఆ ప్రయోగం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా, తీవ్రంగా బెడిసికొట్టడంతో కాంగ్రెస్ కేవలం ఏడు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.

ప్రస్తుతం మరోసారి అదే బాటలో పయనిస్తున్న కాంగ్రెస్‌కు, ఈసారి మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నుంచే సవాళ్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తన 'పీడీఏ' (పిచ్‌డా, దళిత్, అల్పసంఖ్యాక్) నినాదాన్ని మరింత విస్తృతం చేశారు. పీడీఏలోని 'పి' అంటే 'పండిట్' (బ్రాహ్మణులు) అని కూడా అర్థం చెబుతూ ఆ సామాజికవర్గ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం బ్రాహ్మణులను విస్మరిస్తోందని ఆయన నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నారు.
Advertisement
Advertisement
Aradhana Misra
UP PCC President
Uttar Pradesh Congress
Akhilesh Yadav
Brahmin Voters
UP Assembly Elections

More Telugu News