Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐఐటీల్లో కలవరపెడుతున్న విద్యార్థుల మరణాలు.. పదేళ్లలో రెట్టింపు

IIT student deaths doubled in last ten years causing concern
Advertisement
  • ఐఐటీల్లో 20 ఏళ్లలో 171 మంది విద్యార్థులు మృతి
  • 2016 తర్వాత 120 మరణాలు నమోదు
  • ఖరగ్‌పూర్ ఐఐటీలో అత్యధికంగా 29 మంది మృతి
  • గత ఐదేళ్లలో 74 మంది విద్యార్థులు మృతి
  • 2025లో అత్యధికంగా 16 మరణాలు నమోదు
  • 2026లో సెప్టెంబర్ 18 నాటికే 13 మంది మృతి
Advertisement
ఐఐటీ.. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటి. ఇక్కడ సీటు కోసం విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడతారు. కానీ అదే క్యాంపస్‌లలో విద్యార్థుల ఆత్మహత్యలు, అసహజ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2006 నుంచి 2026 సెప్టెంబర్ వరకు ఐఐటీల్లో 171 మంది విద్యార్థులు ఆత్మహత్యలు లేదా అసహజ మరణాలకు గురైనట్లు ఓ లెక్క వెల్లడించింది.

2006 నుంచి 2015 వరకు 51 మరణాలు నమోదయ్యాయి. 2016 నుంచి 2026 సెప్టెంబర్ వరకు ఈ సంఖ్య 120కి చేరింది. ఈ వివరాలను ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి ధీరజ్ సింగ్ ఆర్టీఐ సమాధానాలు, మీడియా కథనాల ఆధారంగా సేకరించారు.

క్యాంపస్‌ల వారీగా చూస్తే ఐఐటీ ఖరగ్‌పూర్‌లో అత్యధికంగా 29 మరణాలు నమోదయ్యాయి. తర్వాత ఐఐటీ మద్రాస్‌లో 26, ఐఐటీ కాన్పూర్‌లో 21 ఉన్నాయి. ఐఐటీ ఢిల్లీలో 17, ఐఐటీ బాంబే, ఐఐటీ గువాహటిలో 14 చొప్పున నమోదయ్యాయి.

ఇటీవలి ఐదేళ్లలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. 2021 సెప్టెంబర్ నుంచి 2026 సెప్టెంబర్ వరకు 74 మంది ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్యలు లేదా అసహజ మరణాలకు గురైనట్లు లెక్కలు చెబుతున్నాయి. 2022, 2023, 2024లో 14 చొప్పున మరణాలు నమోదయ్యాయి. 2025లో 16కి పెరిగాయి. 2026 సెప్టెంబర్ 18 నాటికే 13 మంది మృతి చెందారు.

ఈ లెక్కలు మరణాలకు కారణాలను మాత్రం చెప్పడం లేదు. ఒక్కో ఘటన వెనుక వ్యక్తిగత, చదువు, ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఉండొచ్చు. అయినా ఇటీవలి కాలంలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం ఐఐటీల్లో విద్యార్థుల సంక్షేమంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది.
Advertisement
Advertisement
IIT
Student Suicides
Unnatural Deaths
IIT Kharagpur
IIT Madras
Student Welfare

More Telugu News