Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంత్రి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం.. బెంగళూరులో నిలిచిపోయిన ప్రయాణం

Technical glitch in Minister flight journey stopped in Bengaluru
Advertisement
  • బెంగళూరు-విజయవాడ విమానంలో సాంకేతిక లోపం
  • విమానంలో ఏపీ మంత్రి రామప్రసాద్ రెడ్డి, పలువురు ప్రముఖులు
  • టేకాఫ్‌కు సిద్ధమయ్యాక వెనక్కి తిరిగి వచ్చిన ఫ్లైట్
  • సిబ్బంది నుంచి సమాచారం లేక ప్రయాణికుల అసహనం
  • క్యాబినెట్ భేటీకి వెళ్తుండగా మంత్రికి తప్పని నిరీక్షణ
Advertisement
బెంగళూరు నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో బుధవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండపల్లి రామప్రసాద్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్నారు. టేకాఫ్‌కు సిద్ధమైన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యను గుర్తించడంతో విమానాన్ని తిరిగి బే వద్దకు తీసుకువచ్చారు.

వివరాల్లోకి వెళితే, బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX2875 విజయవాడకు బయలుదేరాల్సి ఉంది. వెలగపూడి సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యేందుకు మంత్రి రామప్రసాద్ రెడ్డి ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే, విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని రన్‌వే పైనుంచి వెనక్కి మళ్లించి, బే వద్దకు తరలించారు.

విమానం తిరిగి ఎప్పుడు బయలుదేరుతుందనే అంశంపై ఎయిర్‌లైన్స్ సిబ్బంది నుంచి స్పష్టమైన సమాచారం లభించడం లేదని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు ప్రయత్నిస్తున్నారని, అంతవరకు వేచి ఉండాలని సిబ్బంది సూచించినట్లు సమాచారం. ఈ పరిణామంతో మంత్రి రామప్రసాద్ రెడ్డి ప్రయాణానికి అంతరాయం కలగగా, మిగిలిన ప్రయాణికులు కూడా విమానాశ్రయంలో నిరీక్షించాల్సి వస్తోంది.
Advertisement
Advertisement
Mandipalli Ramaprasad Reddy
Air India Express
Bengaluru Airport
Technical Snag
Vijayawada Flight
Flight Delay

More Telugu News