Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జూరాలకు నీళ్లివ్వండి.. కర్ణాటక సీఎంకు రేవంత్‌ ఫోన్‌

Revanth Reddy calls Karnataka CM to release water to Jurala
Advertisement
  • జూరాలకు 5 టీఎంసీల నీరు ఇవ్వాలని కోరిన రేవంత్‌
  • నీటి విడుదలకు శివకుమార్‌ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం
  • బెంగళూరులో శివకుమార్‌తో మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ
  • విడతల వారీగా నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి
  • జూరాల నీటి కోసం రైతుల ఆందోళన
Advertisement
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి సమస్యపై సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. జూరాల ప్రాజెక్టుకు ఐదు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను కోరారు. మంగళవారం ఫోన్‌లో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఆయనకు వివరించారు.

జూరాల నుంచి సాగునీరు అందక ఇప్పటికే సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని తెలిపారు. రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఐదు టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై శివకుమార్‌ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మేగా రెడ్డి, జి. మధుసూదన్‌రెడ్డి మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. కర్ణాటక సీఎంతో చర్చించాల్సిన అంశాలపై వారితో మాట్లాడారు.

అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు బెంగళూరుకు బయలుదేరారు. మంగళవారం రాత్రి 8 గంటలకు శివకుమార్‌తో భేటీ కానున్నారు. జూరాలకు నీరు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. ఐదు టీఎంసీల నీటిని ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేయాలని కోరనున్నారు.

జూరాలకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ రైతులు ఇప్పటికే ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలకు బీఆర్‌ఎస్‌ మద్దతు ప్రకటించింది. బీజేపీ కూడా ఈ అంశంపై స్పందించింది. దీంతో జూరాల నీటి వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.
Advertisement
Advertisement
Revanth Reddy
Jurala Project
DK Shivakumar
Palamuru Irrigation Water
Telangana Karnataka Water Issue
5 TMC Water Release

More Telugu News