కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం: కేసీఆర్ కుటుంబ ఆస్తులపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

Telangana
Advertisement
  • ధర్మసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
  • ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానన్న కడియం శ్రీహరి
  • కల్వకుంట్ల కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్న

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని వరంగల్ ఎంపీ కడియం కావ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డితో కలిసి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘనంగా ప్రారంభించారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీ ప్రతినిధులను శాలువాలతో సన్మానించిన అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ప్రజాక్షేత్రంలో ఉంటూ రేవంత్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేలా పట్టుదలతో పనిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 'కొత్త, పాత' వ్యత్యాసాలు వీడి, కేవలం పార్టీ పేరు చెప్పుకుని తిరిగే సంస్కృతికి దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.


ఇదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గడిచిన 12 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క జాతీయ సంస్థనుగానీ, రూ.1000 కోట్ల ప్రాజెక్టునుగానీ మంజూరు చేయకుండా కుల, మత రాజకీయాలతో చిచ్చు పెడుతోందని ఆరోపించారు. 


మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటూ, 2014 ఎన్నికల అఫిడవిట్‌లో ఒక్క ఎకరం భూమి కూడా లేదని చూపించిన కల్వకుంట్ల కుటుంబానికి పదేళ్ల పాలన తర్వాత నేడు వందల ఎకరాలు, ఫామ్‌హౌస్‌లు, వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. 2014కి ముందు ఉన్న ఆస్తులు, ప్రస్తుతం ఉన్న సంపదపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని కడియం శ్రీహరి సవాల్ విసిరారు.

Advertisement

సంబంధిత వార్తలు

Kadiyam SrihariKCR Family AssetsTelangana CongressStation Ghanpur MLABRS vs CongressRevanth Reddy

More Telugu News

రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండే రోజులే గడువు!

23 Nov, 07:40

అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 258 స్థానాలు.. 1992 తర్వాత అతిపెద్ద విజయం

23 Nov, 07:18

ఒక్కడి పట్టుదల.. 8 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు ముంబై మెట్రోకు లైన్ క్లియర్

23 Nov, 07:15

రోజూ అన్నం పెట్టిన వృద్ధుడి అంతిమయాత్రలో వీధి కుక్క.. శ్మశానంలో మౌనంగా కూర్చున్న 'కాలు'

23 Nov, 07:01

జెప్టోకు తొలుత వచ్చినవి 31 ఆర్డర్లే.. మూతపడే పరిస్థితి నుంచి ఎలా ఎదిగిందో చెప్పిన సహ వ్యవస్థాపకుడు

23 Nov, 06:54

డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం... అమెరికాలో 3,500 విమానాలు ఆలస్యం

23 Nov, 06:50

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీ!

23 Nov, 06:40

తిలక్ వర్మ అద్భుత సెంచరీ.. అయినా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఓటమి

23 Nov, 06:34

తీర్పులను విమర్శించండి.. రాజ్యాంగ వ్యవస్థలను కాదు: సీజేఐ సూర్యకాంత్

23 Nov, 06:20

చేవెళ్లలో దొంగతనం ఫిర్యాదు చేసిన మహిళ హత్య: 24 గంటల్లో నిందితుడి అరెస్ట్

23 Nov, 06:18

తెలంగాణలో ‘కోత’ల మోత.. ప్రతీ పదిలో ఆరు సిజేరియన్లే!

23 Nov, 00:57

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 90 సీట్లు గెలుచుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

22 Nov, 23:36

బిస్లెరీ వాటర్ లో ప్రమాదకర రసాయనాలు.. చర్యలకు సిద్ధమైన ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ

22 Nov, 22:57

నవంబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

22 Nov, 22:47

ఏలియన్స్ కోసం నాసా పంపిన గోల్డెన్ రికార్డ్‌లో తెలుగు పలకరింపు.. ఆసక్తికర వివరాలు ఇవిగో!

22 Nov, 22:40
..More Telugu News