ఎల్ నినో ప్రభావాన్ని ముందే అంచనా వేసుకున్నాం.. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలి: సీఎం చంద్రబాబు
- ఎల్ నినో ప్రభావం, ప్రభుత్వ కార్యాచరణపై సీఎం చంద్రబాబు సమీక్ష
- రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరల నియంత్రణే ప్రధాన లక్ష్యం
- బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలు అదుపులో ఉంచాలని ఆదేశం
- డిమాండ్‌కు తగిన పంటల సాగు, వర్షాధార వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచన
- విపత్తును ఎదుర్కొనేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, కార్యాచరణ ప్రణాళిక అమలుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఆర్ఎస్కే సిబ్బందితో ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎల్ నినో వంటి విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడం, మార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరగకుండా నియంత్రించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ఆయన స్పష్టం చేశారు. ఈ విపత్తును ఒక సవాలుగా స్వీకరించి, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, "ఎల్ నినో పరిస్థితులను మనం ముందుగానే అంచనా వేశాం. దీనికోసం సిద్ధం చేసుకున్న యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ఎల్ నినో ప్రభావం కేవలం రైతులపైనే కాదు, అన్ని వ్యవస్థలపైనా పడుతుంది. కాబట్టి రైతులను కాపాడుకుంటూనే, వినియోగదారులపై ధరల భారం పడకుండా చూడటం మన బాధ్యత" అని అన్నారు.
బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు వంటి నిత్యావసరాల ధరలను కచ్చితంగా అదుపులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. గోదాముల్లోని బియ్యం నిల్వలను మార్కెట్లోకి విడుదల చేసి, ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉల్లి కొరతను అధిగమించేందుకు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయడంతో పాటు, భవిష్యత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉల్లి సాగును ప్రోత్సహించాలని తెలిపారు.
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను వివరిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 50.7 శాతం లోటు వర్షపాతం నమోదైందని, ముఖ్యంగా ప్రకాశం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఖరీఫ్ సీజన్లో 30.84 లక్షల హెక్టార్లకు గాను, ఇప్పటివరకు 79 శాతం భూముల్లోనే సాగు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు పంటల బీమా మొత్తాలు వారికి అందేలా చూడాలని, డిమాండ్ ఆధారిత పంటల సాగుపై దృష్టి సారించాలని చెప్పారు.
వర్షాధార పంటలు, ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, హైరిస్క్ జోన్‌లోని ఉద్యాన పంటలను కాపాడేందుకు రూ.190 కోట్లు కేటాయించామని, ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళిక కోసం రూ.60 కోట్లు సిద్ధం చేశామని, 1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం సబ్సిడీతో రైతులకు సరఫరా చేశామని తెలిపారు. స్వయం సహాయక బృందాల ద్వారా కిచెన్ గార్డెన్లను ప్రోత్సహించి కూరగాయల ధరలను అదుపులో ఉంచవచ్చని అభిప్రాయపడ్డారు. పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.
గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ, "2014-19 మధ్య మేము ఇరిగేషన్‌పై రూ.65 వేల కోట్లు ఖర్చు చేస్తే, 2019-24 మధ్య నాటి ప్రభుత్వం కేవలం రూ.22 వేల కోట్లే ఖర్చు చేసింది. ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఎల్ నినో వంటి విపత్తు వచ్చినా ఇబ్బందులు ఉండేవి కావు. మేము అధికారంలోకి వచ్చాక రూ.3,500 కోట్లతో 100 రోజుల్లో హంద్రీ-నీవా కాలువలకు నీరందించగలిగాం" అని చంద్రబాబు గుర్తుచేశారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, స్థానిక ఎన్నికలున్నా ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం, రైతు, సాగునీటి సంఘాలు కలిసికట్టుగా పనిచేసి ఎల్ నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు.