నేను వాళ్లూ, వీళ్లూ వదిలిన బాణాన్ని కాదు: కవిత
- కొడంగల్‌లో పాంచజన్య సంకల్ప సభ
- కొడంగల్ గడ్డపై నుంచి చెబుతున్నా.. నేను ఎవరి బాణాన్ని కాదు అంటూ కవిత వ్యాఖ్యలు
- అధికారానికి దూరంగా ఉన్న బహుజనుల బాణాన్ని నేనని వ్యాఖ్య
- యువత, బహుజనుల కోసం ఎవరితోనైనా పోరాడుతానని ప్రకటన
- అక్షరాస్యత విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కవితః
తాను వాళ్లూ వీళ్లూ వదిలిన బాణాన్ని కాదని, దశాబ్దాలుగా అధికారానికి, విద్యకు దూరంగా ఉన్న బహుజనుల బాణాన్ని అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. యువత, బహుజనుల హక్కుల కోసం ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌తో అయినా కొట్లాడటానికి సిద్ధమని ఆమె ప్రకటించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో ఆదివారం నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సభకు ముందు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వేదిక వద్దకు చేరుకున్న కవిత, తన రాజకీయ వైఖరిని వివరిస్తూ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "నన్ను కాంగ్రెస్ వదిలిన బాణమని బీఆర్‌ఎస్ వాళ్లు, కేసీఆర్ వదిలిన బాణమని రేవంత్‌రెడ్డి అంటున్నారు. మరికొందరు తలకాయ లేనివాళ్లు బీజేపీ బాణమని మాట్లాడుతున్నారు. కొడంగల్ గడ్డపై నుంచి నేను ఒక్కటే చెబుతున్నా. నేను తెలంగాణ బహుజనుల బాణాన్ని. యువజనుల యుద్ధ నినాదాన్ని. అంబేడ్కర్ వాదాన్ని, మహాత్మ జ్యోతిబా ఫులే ఆత్మగౌరవ నినాదాన్ని నేను" అని కవిత ఉద్ఘాటించారు.
ఒక మహిళ ఎవరి మద్దతు లేకుండా రాజకీయంగా నిలబడగలదని నిరూపించేందుకే ఇక్కడికి వచ్చానని, ప్రజలు తనకు ధైర్యం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కవిత విమర్శలు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గట్టు, కేటీ దొడ్డి మండలాల్లో అక్షరాస్యత రేటు అఫ్గానిస్తాన్‌తో సమానంగా ఉందని, గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చేశారని నిలదీశారు.
దేశంలో మహిళలను మహరాణులుగా కీర్తిస్తారని, కానీ వంటింట్లోని గిన్నెల మీద కూడా మగవాళ్ల పేర్లే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. 29 రాష్ట్రాలున్న దేశంలో కేవలం ఒక్క రాష్ట్రానికి మాత్రమే మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. బహుజనులు, మహిళలు, యువత రాజకీయంగా ఎదిగేందుకు తన పోరాటం కొనసాగుతుందని కవిత తెలిపారు.