క్లాస్‌రూం నుంచే సమాజ మార్పు సాధ్యం: మంత్రి నారా లోకేశ్

క్లాస్‌రూం నుంచే సమాజ మార్పు సాధ్యం: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh says social change is possible only from the classroom
  • కాకినాడలో చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 'భారతీయం' కార్యక్రమం
  • హాజరైన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
  • సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదగాలని పిలుపు
  • ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే ఏపీ విద్యావ్యవస్థ దేశంలోనే నెం.1 అవుతుందని వ్యాఖ్యలు
  • త్యాగధనుల బాటలో పయనించి దేశానికి గర్వకారణంగా నిలవాలని విద్యార్థులకు సూచన
సాంకేతికతకు భారతీయ విలువలను జోడించడం ద్వారా విద్యార్థులు ప్రపంచ విజేతలుగా ఎదగాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ దేశంలోనే నెంబర్ వన్ గా రూపుదిద్దుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. పాఠశాల విద్యాశాఖ, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 'భారతీయం' పేరుతో నిర్వహించిన ఈ దేశభక్తి కార్యక్రమానికి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "క్లాస్‌రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం. అందుకే నేను విద్యాశాఖను ఎంచుకున్నాను. దేశభక్తి, నైతిక విలువలే మన కుటుంబ వ్యవస్థకు పునాది" అని అన్నారు. త్యాగధనులే మనకు మార్గదర్శకులని, వారి బాటలో పయనించి ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు, దేశానికి గర్వకారణంగా నిలవాలని లోకేశ్ మార్గనిర్దేశం చేశారు.
Advertisement
Nara Lokesh
Andhra Pradesh Education Minister
Bharatiyam Event Kakinada
Chaganti Koteswara Rao
Indian Moral Values in Education
Social Change through Classrooms

More Telugu News