డోర్నకల్ ఎమ్మెల్యే కారులో మంటలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

Telangana
Advertisement
  • డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ కారులో చెలరేగిన మంటలు
  • ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఎమ్మెల్యే
  • కారులో పవర్ బ్యాంక్ పేలడమే ప్రమాదానికి కారణం
  • ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
  • ప్రజాపాలన దినోత్సవానికి వెళ్తుండగా ఈ ఘటన
డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్ర నాయక్‌కు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడగా, ఆయన కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రాంచంద్ర నాయక్ మహబూబాబాద్ కలెక్టరేట్‌కు బయలుదేరారు. మార్గమద్యంలో చింతపల్లి వద్దకు రాగానే ఆయన కారులో నుంచి పొగలు రావడం మొదలైంది. కారులో ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్‌లో మంటలు వేగంగా వ్యాపించాయి.

వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే, సిబ్బంది కారును నిలిపివేసి కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్‌ మాత్రం స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే మరో వాహనంలో మహబూబాబాద్ కలెక్టరేట్‌కు బయలుదేరి వెళ్లారు. తమ నాయకుడి కారులో మంటలు చెలరేగాయన్న వార్త తెలియడంతో నియోజకవర్గ ప్రజలు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, ఆయన సురక్షితంగా ఉన్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Ramachandra NayakDornakal MLAMahabubabadCar fire accidentPower bank explosionTelangana political news

More Telugu News

రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండే రోజులే గడువు!

23 Nov, 07:40

అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 258 స్థానాలు.. 1992 తర్వాత అతిపెద్ద విజయం

23 Nov, 07:18

ఒక్కడి పట్టుదల.. 8 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు ముంబై మెట్రోకు లైన్ క్లియర్

23 Nov, 07:15

రోజూ అన్నం పెట్టిన వృద్ధుడి అంతిమయాత్రలో వీధి కుక్క.. శ్మశానంలో మౌనంగా కూర్చున్న 'కాలు'

23 Nov, 07:01

జెప్టోకు తొలుత వచ్చినవి 31 ఆర్డర్లే.. మూతపడే పరిస్థితి నుంచి ఎలా ఎదిగిందో చెప్పిన సహ వ్యవస్థాపకుడు

23 Nov, 06:54

డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం... అమెరికాలో 3,500 విమానాలు ఆలస్యం

23 Nov, 06:50

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీ!

23 Nov, 06:40

తిలక్ వర్మ అద్భుత సెంచరీ.. అయినా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఓటమి

23 Nov, 06:34

తీర్పులను విమర్శించండి.. రాజ్యాంగ వ్యవస్థలను కాదు: సీజేఐ సూర్యకాంత్

23 Nov, 06:20

చేవెళ్లలో దొంగతనం ఫిర్యాదు చేసిన మహిళ హత్య: 24 గంటల్లో నిందితుడి అరెస్ట్

23 Nov, 06:18

తెలంగాణలో ‘కోత’ల మోత.. ప్రతీ పదిలో ఆరు సిజేరియన్లే!

23 Nov, 00:57

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 90 సీట్లు గెలుచుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

22 Nov, 23:36

బిస్లెరీ వాటర్ లో ప్రమాదకర రసాయనాలు.. చర్యలకు సిద్ధమైన ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ

22 Nov, 22:57

నవంబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

22 Nov, 22:47

ఏలియన్స్ కోసం నాసా పంపిన గోల్డెన్ రికార్డ్‌లో తెలుగు పలకరింపు.. ఆసక్తికర వివరాలు ఇవిగో!

22 Nov, 22:40
..More Telugu News