Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సింగపూర్ మహిళల వినూత్న ఆలోచన... తెలుగు కుటుంబాల వివాహ సంబంధాల కోసం గ్లోబల్ వేదిక

Ammulu community launches PelliBook com for global Telugu matrimonial needs
Advertisement
  • సింగపూర్ 'అమ్ములు' గ్రూపు నుంచి పెళ్లిబుక్.కామ్ ఆవిష్కరణ
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కుటుంబాల కోసమే ఈ ప్రత్యేక వేదిక
  • విదేశాల్లో పిల్లలకు సరైన సంబంధాలు వెతకడంలో సహాయపడే లక్ష్యం
  • ఒక వాట్సాప్ గ్రూపుగా మొదలై, కమ్యూనిటీ వేదికగా మారిన ప్రయాణం
  • తెలుగు కుటుంబాలను ఒకేచోట చేర్చే ప్రయత్నమని నిర్వాహకుల వెల్లడి
Advertisement
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాల మధ్య బంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఒక కొత్త వేదిక ప్రారంభమైంది. సింగపూర్‌కు చెందిన ‘అమ్ములు’ అనే తెలుగు మహిళా కమ్యూనిటీ, ప్రపంచ తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ‘PelliBook.com’ అనే మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించింది. కేవలం వ్యాపార దృష్టితో కాకుండా, మన కమ్యూనిటీ అవసరాలను మనమే తీర్చుకోవాలనే సదుద్దేశంతో ఈ ప్రయత్నం రూపుదిద్దుకుంది.

ముగ్గురితో మొదలై.. వేల మందికి చేరిన ‘అమ్ములు’

2014లో సింగపూర్‌లో కేవలం ముగ్గురు తెలుగు మహిళలతో ఒక వాట్సాప్ గ్రూప్‌గా ప్రారంభమైన ‘అమ్ములు’ ప్రయాణం, నేడు 3,000 మందికి పైగా సభ్యులతో అతిపెద్ద కమ్యూనిటీగా ఎదిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు, పరస్పర సహాయం, స్నేహ సంబంధాల వేదికగా నిలిచిన ఈ గ్రూప్, కాలక్రమంలో తెలుగు కుటుంబాల అవసరాలను అర్థం చేసుకుంది. ఈ క్రమంలోనే విదేశాల్లో నివసించే తెలుగు తల్లిదండ్రులు తమ పిల్లల వివాహ సంబంధాల విషయంలో ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించింది. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే ఈ ‘PelliBook.com’.

ఎందుకు ఈ ‘పెళ్లిబుక్’?

అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, కెనడా, మధ్యప్రాచ్యం వంటి ఎన్నో దేశాల్లో తెలుగు కుటుంబాలు స్థిరపడ్డాయి. అక్కడి వాతావరణంలో పెరిగిన పిల్లలకు సరైన జీవిత భాగస్వామిని ఎంపిక చేయడం తల్లిదండ్రులకు ఒక పెద్ద బాధ్యతగా మారింది. కేవలం సంబంధం చూడటమే కాకుండా.. తమ కుటుంబ విలువలు, సంస్కృతి, ఆలోచనా విధానం, నేపథ్యం వంటి అంశాలు సరితూగే వ్యక్తి కోసం అన్వేషించాల్సి ఉంటుంది. ఈ అవసరాన్ని తీర్చడానికే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పరిచయాల పరిధిని విస్తృతం చేయాలనే లక్ష్యంతో ‘పెళ్లిబుక్’ను రూపొందించారు.

ప్రతి తెలుగు కుటుంబానికి ఉపయోగపడేలా..

ఈ వెబ్‌సైట్‌లో పెళ్లి వయసుకు వచ్చిన యువతీ యువకులు స్వయంగా లేదా వారి తల్లిదండ్రులు తమ పిల్లల తరఫున బయోడేటాను నమోదు చేయవచ్చు. విద్య, వృత్తి, అభిరుచులు, కుటుంబ నేపథ్యం వంటి వివరాలను పొందుపరిచి, తమకు అనువైన భాగస్వామి కోసం అన్వేషించవచ్చు. ఇప్పుడే సంబంధాల కోసం వెతుకుతున్న వారే కాకుండా, భవిష్యత్తులో అవసరం పడుతుందని భావించే వారు కూడా ముందుగానే తమ పిల్లల వివరాలను నమోదు చేసుకునే సౌకర్యం కల్పించారు.

ఇది కేవలం ఒక మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌గానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కుటుంబాల మధ్య పరిచయాలను పెంచే ఒక కమ్యూనిటీ వేదికగా అభివృద్ధి చేయాలన్నది నిర్వాహకుల ఆలోచన. ఈ ప్రయత్నం విజయవంతం కావాలంటే తెలుగు కుటుంబాల భాగస్వామ్యం కీలకమని, తమకు అవసరం లేకపోయినా బంధువులు, స్నేహితులకు ఈ సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ఇతరులకు సహాయపడొచ్చని నిర్వాహకులు సూచిస్తున్నారు. మన కమ్యూనిటీ కోసం మనమే నిర్మించుకున్న ఈ వేదిక, భవిష్యత్తులో ఎన్నో మంచి బంధాలకు నాంది పలుకుతుందని వారు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement
Advertisement
PelliBook com
Ammulu Telugu Community
Telugu Matrimony Singapore
Global Telugu Marriage Portal
NRI Telugu Matrimony
Telugu Wedding Alliances

More Telugu News