సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

Entertainment
Advertisement
  • కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారంటూ సరిగమ సంస్థ పిటిషన్
  • ఇళయరాజాపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థన
  • ఆయన ఆస్తులను జప్తు చేసి తమకు ఇవ్వాలని పిటిషన్‌లో వినతి
Advertisement
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఆయన ఉల్లంఘిస్తున్నారంటూ ప్రముఖ మ్యూజిక్ సంస్థ 'సరిగమ' దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఈ సందర్భంగా ఆదేశించింది.

సరిగమ సంస్థ తాజాగా దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో ఇళయరాజాపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తాము కాపీరైట్లు హక్కులు కలిగి ఉన్న పాటలను ఆయన వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని, తద్వారా గతంలో కోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా అతిక్రమిస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు ఇళయరాజాపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని విన్నవించింది. అంతేకాకుండా, ఆయన ఆస్తులను జప్తు చేసి, వాటి విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును తమకు చెల్లించాలని కూడా పిటిషన్‌లో కోరింది.

గతంలో ఇళయరాజా స్వరపరిచిన పలు చిత్రాల పాటలకు సంబంధించిన కాపీరైటు హక్కులు తమకే దక్కుతాయని, అయినప్పటికీ ఆయన ఆ హక్కులను క్లెయిమ్ చేస్తూ వాణిజ్యపరంగా వాడుకుంటున్నారని సరిగమ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అప్పట్లో ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, ఈ వ్యవహారంపై స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే, ఆ స్టే ఉత్తర్వులను ఇళయరాజా బేఖాతరు చేస్తున్నారని సరిగమ తాజాగా ఆరోపించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు, ఈ ఫిర్యాదుపై స్పందించాలని ఆదేశిస్తూ ఇళయరాజాకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
Advertisement

సంబంధిత వార్తలు

IlaiyaraajaSaregamaDelhi High CourtCopyright InfringementContempt of Court PetitionMusic Rights Dispute

More Telugu News

న్యూజిలాండ్ గడ్డపై కోహ్లీ క్రేజ్... ఎయిర్‌పోర్ట్‌లో సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్

30 Oct, 10:19

గూగుల్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఒక్కరోజే రూ.47ల‌క్ష‌ల కోట్లు నష్టం.. చరిత్రలోనే అతిపెద్ద పతనాల్లో ఒకటి!

30 Oct, 10:13

ఉపవాసంతో ఆరోగ్యం మెరుగవుతుందా? ఎక్కువసేపు పస్తులుంటే ఏమవుతుంది?

30 Oct, 10:05

నాకు ఎలాంటి అధికారిక ఫ్యాన్ క్లబ్ లేదు: సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్

30 Oct, 10:00

రాష్ట్రస్థాయి షూటర్ ఘాతుకం.. పట్టపగలే తండ్రీకొడుకు సహా ముగ్గురిని కాల్చి చంపేశాడు!

30 Oct, 09:57

పాక్‌లోనూ ‘రామాయణ’ ఫీవర్.. రణ్‌బీర్ సినిమా కోసం కరాచీ హిందువుల పూజలు.. వీడియో వైరల్!

30 Oct, 09:51

అనిల్ కపూర్ ఇంట్లో కర్వా చౌత్ వేడుక... షారుఖ్ లేకుండా వచ్చిన గౌరీ ఖాన్

30 Oct, 09:40

అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులకు ఇస్తే ఊరుకోం.. కంపెనీలకు వాన్స్‌ వార్నింగ్‌!

30 Oct, 09:32

అర్నాబ్ తుపాను బీభత్సం: ఉగ్రరూపం దాల్చిన బాహుదా.. స్తంభించిన ఏపీ-ఒడిశా రవాణా!

30 Oct, 09:29

ఐఫోన్ దొంగలను వెంటాడి పట్టుకున్న యువతి.. ఢిల్లీలో సినీ ఫక్కీలో ఛేజింగ్!

30 Oct, 09:25

ఇషాన్‌ కిషన్‌ వస్తే.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కేనా?

30 Oct, 09:20

టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఆస్తులు రూ. 172 కోట్లు!

30 Oct, 09:16

ఏపీ తీరంలో సాహసోపేత ఆపరేషన్.. 20 మంది సిబ్బందిని రక్షించిన కోస్ట్ గార్డ్

30 Oct, 08:57

స‌ఫారీ క్రికెటర్ తల్లిపై ఫ్యాన్‌ ఫన్నీ ప్లకార్డు.. నవ్వులు పూయించిన అభిమాని.. ఇదిగో వీడియో!

30 Oct, 08:54

ఆగిపోయిన చిరంజీవి-నాని-శ్రీకాంత్ ఓదెల క్రేజీ ప్రాజెక్ట్?

30 Oct, 08:51
..More Telugu News