‘టీమిండియాకు దూరమైన తర్వాత ఆకలి పెరిగింది’.. దులీప్ ట్రోఫీ విజయం తర్వాత ఇషాన్‌

Sports
Advertisement
  • 13 ఏళ్ల తర్వాత దులీప్‌ ట్రోఫీ గెలిచిన ఈస్ట్‌ జోన్‌
  • ఈ విజయానికి సమష్టి కృషి, ఐక్యతే కారణమన్న కెప్టెన్‌ ఇషాన్‌
  • ఒకరికొకరు అండగా నిలిచినట్లు వెల్లడి
  • జాతీయ జట్టుకు దూరమైన తర్వాత తనలో మార్పు వచ్చినట్లు వ్యాఖ్య
  • జట్టు కోసం ఆడడం, టైటిల్‌ గెలవడమే తన లక్ష్యమని స్పష్టీకరణ
Advertisement
దులీప్‌ ట్రోఫీలో ఈస్ట్‌ జోన్‌ 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్లో సౌత్‌ జోన్‌పై ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్‌ సొంతం చేసుకుంది. ఈ విజయానికి జట్టు సమష్టి కృషి, ఐక్యతే కారణమని కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ చెప్పాడు.

‘‘ఈ విజయం మా అందరిదీ. ఒకరికొకరం అండగా నిలిచాం. అదే ఈ జట్టు బలం. నాయకుడిగా నేను కూడా నా వంతు బాగానే చేశాననుకుంటా’’ అంటూ ఇషాన్‌ నవ్వుతూ చెప్పాడు. అయితే విజయంతో ప్రయాణం ముగియదని అన్నాడు. బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో ఇంకా మెరుగుపడాల్సి ఉందని తెలిపాడు.

ఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 270 పరుగులతో భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 80 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన భారీ ఆధిక్యంతో ఈస్ట్‌ జోన్‌కు విజయం ఖాయమైంది. దీంతో 2012-13 సీజన్‌ తర్వాత తొలిసారి దులీప్‌ ట్రోఫీని గెలుచుకుంది.

జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో తనలో చాలా మార్పు వచ్చిందని ఇషాన్‌ చెప్పాడు. ఇప్పుడు మరింత ప్రశాంతంగా ఉంటున్నానని, పరిస్థితులను బాగా అర్థం చేసుకుంటున్నానని చెప్పాడు. జట్టు కోసం ఆడాలనే ఆకలి తనలో మరింత పెరిగిందన్నాడు. జట్టు కోసం ఆడడం, టైటిల్‌ గెలవడమే ఇప్పుడు తన లక్ష్యమని స్పష్టం చేశాడు.

కెప్టెన్‌గా ఇషాన్‌కు ఇది రెండో దేశవాళీ టైటిల్‌. 2025-26 సీజన్‌లో సొంత రాష్ట్రం ఝార్ఖండ్‌కు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ అందించాడు.
Advertisement

సంబంధిత వార్తలు

Ishan KishanDuleep TrophyEast ZoneSouth ZoneMA Chidambaram StadiumIndian Cricket Team

More Telugu News

న్యూజిలాండ్ గడ్డపై కోహ్లీ క్రేజ్... ఎయిర్‌పోర్ట్‌లో సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్

30 Oct, 10:19

గూగుల్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఒక్కరోజే రూ.47ల‌క్ష‌ల కోట్లు నష్టం.. చరిత్రలోనే అతిపెద్ద పతనాల్లో ఒకటి!

30 Oct, 10:13

ఉపవాసంతో ఆరోగ్యం మెరుగవుతుందా? ఎక్కువసేపు పస్తులుంటే ఏమవుతుంది?

30 Oct, 10:05

నాకు ఎలాంటి అధికారిక ఫ్యాన్ క్లబ్ లేదు: సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్

30 Oct, 10:00

రాష్ట్రస్థాయి షూటర్ ఘాతుకం.. పట్టపగలే తండ్రీకొడుకు సహా ముగ్గురిని కాల్చి చంపేశాడు!

30 Oct, 09:57

పాక్‌లోనూ ‘రామాయణ’ ఫీవర్.. రణ్‌బీర్ సినిమా కోసం కరాచీ హిందువుల పూజలు.. వీడియో వైరల్!

30 Oct, 09:51

అనిల్ కపూర్ ఇంట్లో కర్వా చౌత్ వేడుక... షారుఖ్ లేకుండా వచ్చిన గౌరీ ఖాన్

30 Oct, 09:40

అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులకు ఇస్తే ఊరుకోం.. కంపెనీలకు వాన్స్‌ వార్నింగ్‌!

30 Oct, 09:32

అర్నాబ్ తుపాను బీభత్సం: ఉగ్రరూపం దాల్చిన బాహుదా.. స్తంభించిన ఏపీ-ఒడిశా రవాణా!

30 Oct, 09:29

ఐఫోన్ దొంగలను వెంటాడి పట్టుకున్న యువతి.. ఢిల్లీలో సినీ ఫక్కీలో ఛేజింగ్!

30 Oct, 09:25

ఇషాన్‌ కిషన్‌ వస్తే.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కేనా?

30 Oct, 09:20

టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఆస్తులు రూ. 172 కోట్లు!

30 Oct, 09:16

ఏపీ తీరంలో సాహసోపేత ఆపరేషన్.. 20 మంది సిబ్బందిని రక్షించిన కోస్ట్ గార్డ్

30 Oct, 08:57

స‌ఫారీ క్రికెటర్ తల్లిపై ఫ్యాన్‌ ఫన్నీ ప్లకార్డు.. నవ్వులు పూయించిన అభిమాని.. ఇదిగో వీడియో!

30 Oct, 08:54

ఆగిపోయిన చిరంజీవి-నాని-శ్రీకాంత్ ఓదెల క్రేజీ ప్రాజెక్ట్?

30 Oct, 08:51
..More Telugu News