మైనర్ల సోషల్ మీడియా వాడకం... పటిష్ఠమైన రక్షణ అవసరమన్న సుప్రీంకోర్టు

National
Advertisement
  • మైనర్లు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా నిషేధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్
  • కాంట్రాక్ట్ చట్టం ప్రకారం మైనర్లు ఒప్పందాలు చేసుకోలేరని పిటిషనర్ వాదన
  • పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ
  • భారత్‌లో కొన్ని పటిష్ఠమైన రక్షణ చర్యలు అవసరమని చీఫ్ జస్టిస్ వ్యాఖ్య
Advertisement
సోషల్ మీడియా ఖాతాల వినియోగం అంశంలో మైనర్లపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం గురువారం నోటీసులు జారీ చేసింది. భారత కాంట్రాక్ట్ చట్టం ప్రకారం మైనర్లు ఎటువంటి ఒప్పందాల్లోనూ భాగస్వాములు కాలేరని, అలాంటప్పుడు సోషల్ మీడియా ఖాతాలు తెరిచే సమయంలో ఆన్‌లైన్ ఒప్పందాలను వారు ఎలా అంగీకరిస్తారని పిటిషనర్ ప్రశ్నించారు.

జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై సమాధానమివ్వాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, న్యాయ శాఖలను ఆదేశించింది. 'జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్' అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. విచారణలో భాగంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది హెచ్.ఎస్. ఫూల్కా వాదనలు వినిపిస్తూ, అమెరికాలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ సూర్యకాంత్, "భారత్‌లోనూ ఇటువంటి రక్షణ చర్యలు అవసరం ఉంది" అని వ్యాఖ్యానించారు. ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ బాగ్చి స్పందిస్తూ నియంత్రణ కోసం పటిష్ఠమైన 'ఫైర్‌వాల్స్' ఉండాలని అభిప్రాయపడ్డారు.

మైనర్లు సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించడం వల్ల ఆన్‌లైన్ గ్రూమింగ్, లైంగిక వేధింపులు, సైబర్‌ బుల్లీయింగ్, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం వంటి ముప్పులను ఎదుర్కొంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సోషల్ మీడియా సంస్థలు వయసు నిర్ధారణ కోసం పటిష్ఠమైన యంత్రాంగాన్ని అనుసరించేలా, మైనర్లు సొంతంగా ఖాతాలు తెరవకుండా నిరోధించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కాగా, తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండే ఖాతాల ద్వారా విద్యా సంబంధిత కంటెంట్‌ను వీక్షించేందుకు అనుమతించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
Advertisement

సంబంధిత వార్తలు

Supreme Court of IndiaSocial Media Ban for MinorsJust Rights for Children AllianceJustice Surya KantIndian Contract ActOnline Safety for Children

More Telugu News

న్యూజిలాండ్ గడ్డపై కోహ్లీ క్రేజ్... ఎయిర్‌పోర్ట్‌లో సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్

30 Oct, 10:19

గూగుల్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఒక్కరోజే రూ.47ల‌క్ష‌ల కోట్లు నష్టం.. చరిత్రలోనే అతిపెద్ద పతనాల్లో ఒకటి!

30 Oct, 10:13

ఉపవాసంతో ఆరోగ్యం మెరుగవుతుందా? ఎక్కువసేపు పస్తులుంటే ఏమవుతుంది?

30 Oct, 10:05

నాకు ఎలాంటి అధికారిక ఫ్యాన్ క్లబ్ లేదు: సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్

30 Oct, 10:00

రాష్ట్రస్థాయి షూటర్ ఘాతుకం.. పట్టపగలే తండ్రీకొడుకు సహా ముగ్గురిని కాల్చి చంపేశాడు!

30 Oct, 09:57

పాక్‌లోనూ ‘రామాయణ’ ఫీవర్.. రణ్‌బీర్ సినిమా కోసం కరాచీ హిందువుల పూజలు.. వీడియో వైరల్!

30 Oct, 09:51

అనిల్ కపూర్ ఇంట్లో కర్వా చౌత్ వేడుక... షారుఖ్ లేకుండా వచ్చిన గౌరీ ఖాన్

30 Oct, 09:40

అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులకు ఇస్తే ఊరుకోం.. కంపెనీలకు వాన్స్‌ వార్నింగ్‌!

30 Oct, 09:32

అర్నాబ్ తుపాను బీభత్సం: ఉగ్రరూపం దాల్చిన బాహుదా.. స్తంభించిన ఏపీ-ఒడిశా రవాణా!

30 Oct, 09:29

ఐఫోన్ దొంగలను వెంటాడి పట్టుకున్న యువతి.. ఢిల్లీలో సినీ ఫక్కీలో ఛేజింగ్!

30 Oct, 09:25

ఇషాన్‌ కిషన్‌ వస్తే.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కేనా?

30 Oct, 09:20

టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఆస్తులు రూ. 172 కోట్లు!

30 Oct, 09:16

ఏపీ తీరంలో సాహసోపేత ఆపరేషన్.. 20 మంది సిబ్బందిని రక్షించిన కోస్ట్ గార్డ్

30 Oct, 08:57

స‌ఫారీ క్రికెటర్ తల్లిపై ఫ్యాన్‌ ఫన్నీ ప్లకార్డు.. నవ్వులు పూయించిన అభిమాని.. ఇదిగో వీడియో!

30 Oct, 08:54

ఆగిపోయిన చిరంజీవి-నాని-శ్రీకాంత్ ఓదెల క్రేజీ ప్రాజెక్ట్?

30 Oct, 08:51
..More Telugu News