కాకినాడ జిల్లాలో పులి సంచారం.. రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్

Andhra
Advertisement
  • కాకినాడ జిల్లాలో పులి సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష
  • పులి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు ఆదేశం
  • అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచన
  • ప్రజల భద్రతతో పాటు పులికి హాని జరగకుండా చూడాలని స్పష్టీకరణ
Advertisement
కాకినాడ జిల్లాలో పులి సంచారం స్థానికంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్తిపాడు మండలం ధారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి తిరుగుతున్న సమాచారంతో ఆయన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, దానిని పట్టుకునేందుకు అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు.

పులి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అటవీ శాఖ, ప్రత్యేక 'హనుమాన్' బృందాలు నిరంతర నిఘా కొనసాగించాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. పులి జనావాసాల్లోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాపిడ్ రెస్పాన్స్ బృందాలను సర్వసన్నద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూ, వారికి భద్రతపై భరోసా కల్పించాలని అధికారులకు తెలిపారు. "ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అదే సమయంలో, పులికి ఎలాంటి హాని కలగకుండా చూడటం కూడా మన బాధ్యత" అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Pawan KalyanKakinada Tiger MovementAndhra Pradesh Forest DepartmentHanuman TeamsPrathipadu Reserve ForestTiger Search Operation

More Telugu News

న్యూజిలాండ్ గడ్డపై కోహ్లీ క్రేజ్... ఎయిర్‌పోర్ట్‌లో సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్

30 Oct, 10:19

గూగుల్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఒక్కరోజే రూ.47ల‌క్ష‌ల కోట్లు నష్టం.. చరిత్రలోనే అతిపెద్ద పతనాల్లో ఒకటి!

30 Oct, 10:13

ఉపవాసంతో ఆరోగ్యం మెరుగవుతుందా? ఎక్కువసేపు పస్తులుంటే ఏమవుతుంది?

30 Oct, 10:05

నాకు ఎలాంటి అధికారిక ఫ్యాన్ క్లబ్ లేదు: సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్

30 Oct, 10:00

రాష్ట్రస్థాయి షూటర్ ఘాతుకం.. పట్టపగలే తండ్రీకొడుకు సహా ముగ్గురిని కాల్చి చంపేశాడు!

30 Oct, 09:57

పాక్‌లోనూ ‘రామాయణ’ ఫీవర్.. రణ్‌బీర్ సినిమా కోసం కరాచీ హిందువుల పూజలు.. వీడియో వైరల్!

30 Oct, 09:51

అనిల్ కపూర్ ఇంట్లో కర్వా చౌత్ వేడుక... షారుఖ్ లేకుండా వచ్చిన గౌరీ ఖాన్

30 Oct, 09:40

అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులకు ఇస్తే ఊరుకోం.. కంపెనీలకు వాన్స్‌ వార్నింగ్‌!

30 Oct, 09:32

అర్నాబ్ తుపాను బీభత్సం: ఉగ్రరూపం దాల్చిన బాహుదా.. స్తంభించిన ఏపీ-ఒడిశా రవాణా!

30 Oct, 09:29

ఐఫోన్ దొంగలను వెంటాడి పట్టుకున్న యువతి.. ఢిల్లీలో సినీ ఫక్కీలో ఛేజింగ్!

30 Oct, 09:25

ఇషాన్‌ కిషన్‌ వస్తే.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కేనా?

30 Oct, 09:20

టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఆస్తులు రూ. 172 కోట్లు!

30 Oct, 09:16

ఏపీ తీరంలో సాహసోపేత ఆపరేషన్.. 20 మంది సిబ్బందిని రక్షించిన కోస్ట్ గార్డ్

30 Oct, 08:57

స‌ఫారీ క్రికెటర్ తల్లిపై ఫ్యాన్‌ ఫన్నీ ప్లకార్డు.. నవ్వులు పూయించిన అభిమాని.. ఇదిగో వీడియో!

30 Oct, 08:54

ఆగిపోయిన చిరంజీవి-నాని-శ్రీకాంత్ ఓదెల క్రేజీ ప్రాజెక్ట్?

30 Oct, 08:51
..More Telugu News