డీఎస్సీ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను ప్రజల ముందుకు తీసుకొస్తా: జగన్

Andhra
Advertisement
  • మెగా డీఎస్సీ ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయన్న జగన్
  • స్పోర్ట్స్ కోటా నిబంధనలను ఎందుకు మార్చారని ప్రశ్న
  • జూడో ఆట కింద 39 మందికి ఉద్యోగాలు ఇచ్చారని విమర్శ
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని వైసీపీ అధినేత జగన్ మరోసారి ఆరోపించారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని అన్నారు. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసత్యాలు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన అన్ని ఆధారాలను త్వరలోనే సమగ్రంగా ప్రజల ముందుకు తీసుకొస్తానని స్పష్టం చేశారు. 


ప్రశ్నపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఒకే ఒక్క వ్యక్తికి/సంస్థకు ఎలా అప్పగిస్తారని జగన్ ప్రశ్నించారు. ఎస్‌సీఈఆర్‌టీ విభాగంలో పనిచేస్తున్న నవీన్ అనే అభ్యర్థికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? అసలు మొదటి ర్యాంక్ సాధించిన నవీన్‌కు ఉద్యోగం ఎందుకు నిరాకరించారు? అని ప్రశ్నించారు.


జీవో నంబర్ 4, జీవో నంబర్ 47లను తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటా నిబంధనలను ఎందుకు మార్చారు? పరీక్షలు నిర్వహించకుండానే 372 మందికి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కట్టబెట్టడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించారు. 'జూడో' అనే ఆట కింద ఏకంగా 39 మందికి అక్రమంగా సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు.

మెగా డీఎస్సీ అక్రమాలపై తమ పార్టీ ఆధారాలతో సహా నిలదీస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు కోపం వచ్చి బీపీ పెరుగుతోందని, మంత్రి నారా లోకేశ్ ను కాపాడుకోవడానికి ప్రభుత్వం తాపత్రయపడుతోందని జగన్ ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

సంబంధిత వార్తలు

YS Jagan Mohan ReddyAP Mega DSC ScamAndhra Pradesh DSC RecruitmentNara LokeshChandrababu NaiduAP Teacher Jobs Irregularities

More Telugu News

గూగుల్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఒక్కరోజే రూ.47ల‌క్ష‌ల కోట్లు నష్టం.. చరిత్రలోనే అతిపెద్ద పతనాల్లో ఒకటి!

30 Oct, 10:13

ఉపవాసంతో ఆరోగ్యం మెరుగవుతుందా? ఎక్కువసేపు పస్తులుంటే ఏమవుతుంది?

30 Oct, 10:05

నాకు ఎలాంటి అధికారిక ఫ్యాన్ క్లబ్ లేదు: సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్

30 Oct, 10:00

రాష్ట్రస్థాయి షూటర్ ఘాతుకం.. పట్టపగలే తండ్రీకొడుకు సహా ముగ్గురిని కాల్చి చంపేశాడు!

30 Oct, 09:57

పాక్‌లోనూ ‘రామాయణ’ ఫీవర్.. రణ్‌బీర్ సినిమా కోసం కరాచీ హిందువుల పూజలు.. వీడియో వైరల్!

30 Oct, 09:51

అనిల్ కపూర్ ఇంట్లో కర్వా చౌత్ వేడుక... షారుఖ్ లేకుండా వచ్చిన గౌరీ ఖాన్

30 Oct, 09:40

అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులకు ఇస్తే ఊరుకోం.. కంపెనీలకు వాన్స్‌ వార్నింగ్‌!

30 Oct, 09:32

అర్నాబ్ తుపాను బీభత్సం: ఉగ్రరూపం దాల్చిన బాహుదా.. స్తంభించిన ఏపీ-ఒడిశా రవాణా!

30 Oct, 09:29

ఐఫోన్ దొంగలను వెంటాడి పట్టుకున్న యువతి.. ఢిల్లీలో సినీ ఫక్కీలో ఛేజింగ్!

30 Oct, 09:25

ఇషాన్‌ కిషన్‌ వస్తే.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కేనా?

30 Oct, 09:20

టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఆస్తులు రూ. 172 కోట్లు!

30 Oct, 09:16

ఏపీ తీరంలో సాహసోపేత ఆపరేషన్.. 20 మంది సిబ్బందిని రక్షించిన కోస్ట్ గార్డ్

30 Oct, 08:57

స‌ఫారీ క్రికెటర్ తల్లిపై ఫ్యాన్‌ ఫన్నీ ప్లకార్డు.. నవ్వులు పూయించిన అభిమాని.. ఇదిగో వీడియో!

30 Oct, 08:54

ఆగిపోయిన చిరంజీవి-నాని-శ్రీకాంత్ ఓదెల క్రేజీ ప్రాజెక్ట్?

30 Oct, 08:51

హిమాలయాల్లో ప్రకృతి ప్రకోపం.. అప్రమత్తమైన భారత సరిహద్దు జిల్లాలు

30 Oct, 08:47
..More Telugu News