50 గంటల బ్యాటరీ.. ఏఐ ఫీచర్లు.. యాపిల్‌ కొత్త వాచ్‌లు అదుర్స్‌

10-09-2026 Thu 08:43 | Technology
Advertisement
  • యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 12 ధర రూ.56,900 నుంచి ప్రారంభం
  • వాచ్‌ అల్ట్రా 4 ప్రారంభ ధర రూ.1,09,900
  • ఎయిర్‌పాడ్స్‌ 5 ధర రూ.14,900 నుంచి అందుబాటులోకి
  • వాచ్‌ సిరీస్‌ 12లో హార్ట్‌రేట్‌ ప్రతి 5 సెకన్లకు ట్రాక్‌
  • ఎయిర్‌పాడ్స్‌ 5లో ఏఎన్‌సీతో పాటు సిరి ఏఐ, లైవ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్లు
Advertisement
యాపిల్‌ సరికొత్త వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ‘సర్‌ప్రైజ్‌ అండ్‌ షైన్‌’ పేరుతో జరిగిన ఈవెంట్‌లో ఐఫోన్‌ 18 సిరీస్‌తో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 12, యాపిల్‌ వాచ్‌ అల్ట్రా 4, ఎయిర్‌పాడ్స్‌ 5ను ప్రకటించింది. ఆరోగ్య పర్యవేక్షణ, బ్యాటరీ సామర్థ్యం, ఏఐ ఫీచర్లపై ప్రధానంగా దృష్టి పెట్టింది.

వాచ్‌ సిరీస్‌ 12లో కొత్త ఫీచర్లు
వాచ్‌ సిరీస్‌ 12లో కొత్త ఎస్‌11 చిప్‌ను అమర్చింది. ఇది అత్యంత శక్తిమంతమైన వేరబుల్‌ చిప్‌ అని యాపిల్‌ తెలిపింది. హార్ట్‌రేట్‌ను ఇకపై ప్రతి 5 సెకన్లకు ఒకసారి పరిశీలిస్తుంది. 42ఎంఎం, 46ఎంఎం సైజుల్లో వాచ్‌ అందుబాటులో ఉంటుంది.

కొత్త హెల్త్‌ సెన్సింగ్‌ సిస్టమ్‌తో హెచ్‌ఆర్‌వీ ట్రాకింగ్‌ మరింత తరచూ జరుగుతుంది. రెడీనెస్‌ స్కోర్‌ కూడా అందిస్తోంది. రోజువారీ శారీరక శ్రమ, ట్రైనింగ్‌ లోడ్‌, ఆరోగ్య వివరాలు, నిద్ర ఆధారంగా 0 నుంచి 10 వరకు స్కోర్‌ ఇస్తుంది. విశ్రాంతి తీసుకోవాలా, వ్యాయామం కొనసాగించాలా అన్న దానిపై సూచనలు చేస్తుంది.

రోజువారీ బ్యాటరీ 24 గంటల వరకు ఉంటుంది. అవుట్‌డోర్‌ వర్కౌట్‌లో 10 గంటల వరకు పనిచేస్తుంది. 15 నిమిషాల ఛార్జింగ్‌తో 12 గంటల బ్యాటరీ లైఫ్‌ వస్తుంది. అల్యూమినియం, టైటానియం, సిరామిక్‌ ఫినిష్‌లలో లభిస్తుంది.

అల్ట్రా 4లో భారీ బ్యాటరీ
వాచ్‌ అల్ట్రా 4లోనూ ఎస్‌11 చిప్‌, హెల్త్‌ సెన్సింగ్‌ సిస్టమ్‌ ఉన్నాయి. సాధారణ వినియోగంలో 50 గంటల వరకు బ్యాటరీ ఉంటుంది. లో పవర్‌ మోడ్‌లో 84 గంటల వరకు పనిచేస్తుంది. పూర్తి జీపీఎస్‌, హార్ట్‌రేట్‌ ట్రాకింగ్‌తో 25 గంటల వరకు వర్కౌట్‌ చేయొచ్చు. మ్యాక్స్‌ ఎక్స్‌టెండెండ్‌ వర్కౌట్‌ మోడ్‌లో 45 గంటల వరకు బ్యాటరీ ఉంటుంది.

ఎయిర్‌పాడ్స్‌ 5లో మెరుగైన ఏఎన్‌సీ
ఎయిర్‌పాడ్స్‌ 5లో ఓపెన్‌ ఇయర్‌ డిజైన్‌తో మెరుగైన ‘యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌’ (ఏఎన్‌సీ) అందిస్తోంది. ఎయిర్‌పాడ్స్‌ 4తో పోలిస్తే 50 శాతం వరకు ఎక్కువ శబ్దాన్ని తగ్గిస్తుందని యాపిల్‌ తెలిపింది. ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌, అడాప్టివ్‌ ఆడియో, కన్వర్జేషన్‌ అవేర్‌నెస్‌ ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త అకౌస్టిక్‌ ఆర్కిటెక్చర్‌, అడాప్టివ్‌ ఈక్యూతో సౌండ్‌ నాణ్యత మెరుగుపడుతుంది. ఐఓఎస్‌ 27తో పనిచేసే అనుకూల ఐఫోన్లలో సిరి ఏఐ, హెడ్‌ జెస్చర్‌ రెస్పాన్స్‌, లైవ్‌ ట్రాన్స్‌లేషన్‌ సదుపాయాలు లభిస్తాయి.

ధరలు, విక్రయాలు
యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 12 అల్యూమినియం మోడల్‌ ధర రూ.56,900. టైటానియం రూ.99,900, సిరామిక్‌ రూ.1,24,900. వాచ్‌ అల్ట్రా 4 ధర రూ.1,09,900. టైటానియం  లూప్‌ మోడల్‌ రూ.1,24,900.

ఎయిర్‌పాడ్స్‌ 5 ధర రూ.14,900. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ కేసుతో ధర రూ.17,900. మూడు ఉత్పత్తులకు ఇవాళ్టి నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ 18న విక్రయాలు మొదలవుతాయి.
Advertisement
AppleApple Watch Series 12Apple Watch Ultra 4AirPods 5 price in IndiaApple S11 chip featuresApple health sensing system

More Telugu News

టీమిండియా చేతిలో వరుసగా రెండు ఓటములపై న్యూజిలాండ్ కోచ్ ఏమన్నాడంటే..!

25-10-2026 Sun 15:33

ఎంతటి లక్ష్యమైనా భారత బలగాలను దాటిపోలేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్

25-10-2026 Sun 15:01

దీని గురించి ఎందుకు మాట్లాడరు?.. విశాఖ గంగవరం బీచ్ పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్

25-10-2026 Sun 14:41

ఏఈ లలిత కుమారి హత్య కేసు.. నేరుగా ఆమె భర్త వద్దకు వెళ్లిన పోలీసు జాగిలం!

25-10-2026 Sun 14:30

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24
..more