టీటీడీ సిబ్బంది నిజాయతీ.. భక్తుడు మర్చిపోయిన రూ.5 లక్షల విలువైన వస్తువులు అప్పగింత

08-09-2026 Tue 19:16 | Andhra
Advertisement
  • తిరుమల యాత్రికుడు మర్చిపోయిన బ్యాగును అప్పగించిన సిబ్బంది
  • బ్యాగులో రూ.5 లక్షల విలువైన బంగారం, రూ.10,900 నగదు
  • తమిళనాడుకు చెందిన భక్తుడికి చేరిన విలువైన వస్తువులు
  • టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిజాయతీపై భక్తుడి ప్రశంసలు
Advertisement
తిరుమల కొండపై విధులు నిర్వర్తించే టీటీడీ సిబ్బంది మరోసారి తమ నిజాయతీని, అప్రమత్తతను చాటుకున్నారు. ఓ భక్తుడు పొరపాటున మర్చిపోయిన సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగును విజిలెన్స్ సిబ్బంది సురక్షితంగా అతనికి అప్పగించారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం తిరుమల మార్గంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన పి. కార్తికేయన్ అనే భక్తుడు తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరారు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో అలిపిరి తనిఖీ కేంద్రం (చెప్పాయింట్) వద్ద తనిఖీల అనంతరం, ఆయన తన బ్యాగును అక్కడే మర్చిపోయి తిరుమలకు వెళ్లిపోయారు.

విధి నిర్వహణలో ఉన్న విజిలెన్స్ సిబ్బంది అక్కడ పడి ఉన్న బ్యాగును గుర్తించారు. దాన్ని పరిశీలించగా, అందులో విలువైన బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదు ఉన్నట్లు గమనించారు. వెంటనే బ్యాగులో లభించిన వివరాల ఆధారంగా భక్తుడు కార్తికేయన్‌ను ఫోన్‌లో సంప్రదించారు. బ్యాగు తమ వద్ద సురక్షితంగా ఉందని, తిరిగి వచ్చి తీసుకువెళ్లాలని సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న కార్తికేయన్ వెంటనే తనిఖీ కేంద్రానికి చేరుకున్నారు. అధికారులు బ్యాగులోని వస్తువుల గురించి అడగగా, ఆయన అన్నింటినీ సరిగ్గా వివరించారు. ఆయన చెప్పిన వివరాలు సరిపోలడంతో, సిబ్బంది బ్యాగును అతనికి అందజేశారు. బ్యాగులో రూ.10,900 నగదు, రెండు గాజులు, ఒక బంగారు గొలుసు, రెండు బంగారు ఉంగరాలు ఉన్నాయని టీటీడీ సెక్టార్-5 ఏవీఎస్వో రమేశ్ తెలిపారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

తన విలువైన వస్తువులు తిరిగి దొరకడంతో భక్తుడు కార్తికేయన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంతటి అప్రమత్తత, నిజాయతీతో వ్యవహరించి తన బ్యాగును భద్రంగా అప్పగించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
TTD Vigilance StaffTirumala Tirupati DevasthanamsTirumala devotee lost bagAlipiri Checkpoint TirupatiTTD staff honestyP Karthikeyan Tirumala

More Telugu News

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55
..more