‘అన్నయ్యా.. ఎలా ఉన్నావు?’ అని పలకరిస్తే చాలు.. బ్రహ్మానందం సోదరుడి భావోద్వేగ వ్యాఖ్యలు
- బ్రహ్మానందం సోదరుడు శ్రీవదన్ భావోద్వేగ వ్యాఖ్యలు
- తమ్ముడు తనకు ఫోన్ చేయడం లేదని ఆవేదన
- ఆరుగురు సంతానంలో నలుగురు చనిపోయారని వెల్లడి
- స్వగ్రామంలో తాను ఒంటరిగా ఉంటున్నానని వెల్లడి
- ఒక్కసారి ఫోన్ చేసి పలకరిస్తే చాలని వ్యాఖ్య
తన హాస్యంతో కోట్లాది మంది ప్రేక్షకులను నవ్వించే ప్రముఖ నటుడు బ్రహ్మానందం సోదరుడు శ్రీవదన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తమ్ముడి నుంచి ఒక చిన్న పలకరింపు కోసం ఎదురుచూస్తున్నానని ఆయన భావోద్వేగంగా చెప్పారు. తాము ఆరుగురు సంతానమని.. నలుగురు చనిపోగా, ఇప్పుడు ఇద్దరమే మిగిలామని తెలిపారు. స్వగ్రామంలో తాను ఒంటరిగా ఉంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల బ్రహ్మానందం స్వగ్రామానికి వచ్చినా తనను పలకరించకుండానే వెళ్లిపోయారని శ్రీవదన్ తెలిపారు. తమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసి ‘అన్నయ్యా.. ఎలా ఉన్నావు?’ అని అడుగుతాడేమోనని ఆశగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.
“ఆయన పెద్ద నటుడు. సినిమాల షూటింగులతో బిజీగా ఉంటారని తెలుసు. అయినా ఒకటి, రెండు నిమిషాలు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. అంతే చాలు” అని శ్రీవదన్ పేర్కొన్నారు. తమ్ముడి నుంచి తనకు డబ్బు, మరే సాయం అవసరం లేదని.. ఆప్యాయంగా పలకరిస్తే చాలన్న భావనను ఆయన వ్యక్తం చేశారు.
బ్రహ్మానందంపై శ్రీవదన్ ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఆయన బిజీగా ఉండటాన్ని తాను అర్థం చేసుకుంటున్నానని చెప్పారు. అయితే వయసు పెరిగిన సమయంలో సొంతవారి పలకరింపు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. “గొప్ప స్థాయిలో ఉన్నవారు తమకు దగ్గరైనవారిని పలకరిస్తే.. అది వారికి ఎంతో ఆనందం కలిగిస్తుంది” అని అన్నారు.
శ్రీవదన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ఆయన ఆవేదనపై స్పందిస్తున్నారు. అయితే సోదరుల మధ్య దూరానికి కారణం ఏమిటన్నది శ్రీవదన్ వెల్లడించలేదు. ఈ వ్యాఖ్యలపై బ్రహ్మానందం కూడా ఇప్పటివరకు స్పందించలేదు.