అక్టోబర్ 1 నుంచి ఎస్‌బీఐ కొత్త రూల్.. ఐదోసారి డబ్బు తీస్తే..!
- అక్టోబర్ 1 నుంచి బీఎస్‌బీడీ ఖాతాలకు కొత్త నిబంధనలు
- నెలలో నాలుగు నగదు ఉపసంహరణలు మాత్రమే ఉచితం
- ఐదో ఉపసంహరణ నుంచి రూ.15తో పాటు జీఎస్‌టీ
- లెక్కలోకి ఏటీఎం, శాఖలో చేసిన, ఏఈపీఎస్ లావాదేవీలు
- డిజిటల్ లావాదేవీల మినహాయింపును తొలగించిన ఎస్‌బీఐ
ఎస్‌బీఐలో బేసిక్ సేవింగ్స్ ఖాతా ఉందా? అయితే అక్టోబర్ 1 నుంచి నగదు తీసుకునేటప్పుడు లెక్క చూసుకోవాల్సిందే. నెలలో నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఐదోసారి తీసుకుంటే రూ.15తో పాటు జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ కొత్త నిబంధన సాధారణ సేవింగ్స్ ఖాతాలన్నింటికీ కాదు. ఎస్‌బీఐ ‘బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్’ (బీఎస్‌బీడీ) ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తుంది.
నాలుగు ఉచిత నగదు ఉపసంహరణల్లో ఎస్‌బీఐ ఏటీఎంలు, ఇతర బ్యాంకుల ఏటీఎంలు, బ్యాంకు శాఖలు, ఏఈపీఎస్ ద్వారా తీసుకునే నగదు కూడా లెక్కలోకి వస్తుంది. మొత్తం నాలుగు సార్లు ఉచితంగా తీసుకున్న తర్వాత, అదే నెలలో మరోసారి నగదు తీసుకుంటే రూ.15తో పాటు జీఎస్‌టీ వసూలు చేస్తారు.
కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ తెలిపింది. ఇప్పటివరకు నాలుగు ఉచిత లావాదేవీల లెక్కలో డిజిటల్ లావాదేవీలకు మినహాయింపు ఉండేది. తాజా మార్పుతో ఆ మినహాయింపును తొలగించారు. దీంతో బీఎస్‌బీడీ ఖాతాదారులు నెలవారీ లావాదేవీలపై మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
బీఎస్‌బీడీ ఖాతాకు కనీస నిల్వ నిబంధన లేదు. చెక్‌బుక్ సదుపాయం ఉండదు. రూపే ఏటీఎం-కమ్ డెబిట్ కార్డు ఉచితంగా ఇస్తారు. ఈ ఖాతా ఉన్నవారు ఎస్‌బీఐలో మరో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండరాదని బ్యాంకు స్పష్టం చేసింది.