భారీ బడ్జెట్ చిత్రాలకు ఊరట.. టికెట్ల పెంపునకు తెలంగాణ సర్కార్ అనుమతి

Telangana
Advertisement
  • భారీ బడ్జెట్ చిత్రాలకు 10 రోజుల పాటు టికెట్ల పెంపునకు అనుమతి
  • అందుకుగానూ రూ. కోటి సంక్షేమ నిధికి జమ చేయాలన్న నిబంధన
  • థియేటర్లలో రోజుకు 5 ఆటలు ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు
  • చిన్న సినిమాలకు తప్పనిసరిగా ఒక షో కేటాయించాలని ఆదేశం
  • నాణ్యమైన సింగిల్ స్క్రీన్ల కోసం ‘స్పెషల్ థియేటర్’ కేటగిరీ ఏర్పాటు
తెలంగాణలో సినిమా టికెట్ల ధరల నియంత్రణ, ప్రదర్శనల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. భారీ బడ్జెట్ చిత్రాల విడుదలైన తొలి 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం, ఇందుకోసం ఒక కీలక నిబంధనను విధించింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం వెలుగులోకి వచ్చాయి.

తాజా ఆదేశాల ప్రకారం.. రూ.100 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన చిత్రాలను 'సూపర్ హై-బడ్జెట్' సినిమాలుగా పరిగణిస్తారు. అటువంటి చిత్రాల నిర్మాతలు టికెట్ ధరలను పెంచుకోవాలంటే, ముందుగా తెలుగు సినిమా పరిశ్రమ సంక్షేమ కమిటీ ఖాతాలో రూ. కోటి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నిధిని సినీ కార్మికుల సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. కార్మిక శాఖ, నిర్మాతల మండలి, ఎగ్జిబిటర్ల యూనియన్ ప్రతినిధులతో కూడిన కమిటీ ఈ నిధిని పర్యవేక్షిస్తుంది.

చిన్న సినిమాలకు ప్రోత్సాహం అందించే దిశగా ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. థియేటర్లలో ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతించింది. అయితే, పండుగ రోజులు సహా సాధారణ రోజుల్లోనూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఒక షోను తప్పనిసరిగా చిన్న చిత్రాల ప్రదర్శనకే కేటాయించాలనే నిబంధన విధించింది.

కొత్త నిబంధనల ప్రకారం.. టికెట్ ధరలపై జీఎస్టీ అదనంగా ఉంటుంది. నిర్వహణ చార్జీల కింద ఏసీ థియేటర్లు రూ. 5, ఎయిర్-కూల్డ్ థియేటర్లు రూ. 3 అదనంగా వసూలు చేసేందుకు అనుమతినిచ్చారు. అలాగే ప్రతి థియేటర్‌లో కనీసం 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీలో ఉంచడం తప్పనిసరి. మల్టీప్లెక్స్‌లకు సమానంగా వసతులున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను 'స్పెషల్ థియేటర్' కేటగిరీగా గుర్తించనున్నారు. జిల్లా కలెక్టర్ లేదా పోలీస్ కమిషనర్ నేతృత్వంలోని కమిటీలు ఈ హోదాను ఖరారు చేస్తాయి. సినిమా రంగంలోని వివిధ వర్గాల విజ్ఞప్తి మేరకు, భారీ చిత్రాలకు ధరల పెంపుతో పాటు చిన్న సినిమాల ప్రదర్శనపై స్పష్టతనిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.                                
Advertisement

సంబంధిత వార్తలు

Telangana GovernmentCinema Ticket PricesMovie Ticket HikeSuper High Budget MoviesTelugu Film IndustryCine Workers Welfare

More Telugu News

ఆయిల్ ధరలు, ఇరాన్ దూకుడు.. అన్నింటికీ డెమోక్రాట్లే కారణం: ట్రంప్

23 Nov, 08:43

పల్నాడులో భారీ హింసకు ప్లాన్.. బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు అరెస్ట్.. మొత్తం 66 మందిపై కేసులు

23 Nov, 08:39

ఆ స‌మ‌యంలో నాతో ఏ ఒక్క‌రైనా నిలబ‌డి ఉంటే.. నేనే మ్యాచ్ ముగించే వాడిని: కెప్టెన్‌ తిల‌క్ వ‌ర్మ‌

23 Nov, 08:15

తొలి టెస్టుపై భారత్ పట్టు.. విజయం దిశగా టీమిండియా

23 Nov, 08:13

బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందా?.. విశ్లేషకులు ఏమంటున్నారంటే!

23 Nov, 08:06

ఫుడ్ డెలివరీ కోసం రోజూ 100 కి.మీ. సైకిల్ తొక్కిన యువకుడు.. ఇప్పుడు సీఏ

23 Nov, 07:59

విదేశీ ఉపాధిలో తెలంగాణ టామ్‌కామ్ రికార్డ్.. 15 వేల మందికి కొలువులు!

23 Nov, 07:57

రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండే రోజులే గడువు!

23 Nov, 07:40

అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 258 స్థానాలు.. 1992 తర్వాత అతిపెద్ద విజయం

23 Nov, 07:18

ఒక్కడి పట్టుదల.. 8 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు ముంబై మెట్రోకు లైన్ క్లియర్

23 Nov, 07:15

రోజూ అన్నం పెట్టిన వృద్ధుడి అంతిమయాత్రలో వీధి కుక్క.. శ్మశానంలో మౌనంగా కూర్చున్న 'కాలు'

23 Nov, 07:01

జెప్టోకు తొలుత వచ్చినవి 31 ఆర్డర్లే.. మూతపడే పరిస్థితి నుంచి ఎలా ఎదిగిందో చెప్పిన సహ వ్యవస్థాపకుడు

23 Nov, 06:54

డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం... అమెరికాలో 3,500 విమానాలు ఆలస్యం

23 Nov, 06:50

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీ!

23 Nov, 06:40

తిలక్ వర్మ అద్భుత సెంచరీ.. అయినా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఓటమి

23 Nov, 06:34
..More Telugu News