వెయ్యి కోట్లు ఇచ్చినా జగ్గారెడ్డి వంటి వారు దొరకరు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంస

Telangana
Advertisement
  • సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రశంసల వర్షం
  • వెయ్యి కోట్లు ఇచ్చినా జగ్గారెడ్డి లాంటి నేత దొరకరని వ్యాఖ్య
  • రాహుల్ గాంధీ రాముడైతే, జగ్గారెడ్డి హనుమంతుడన్న ముఖ్యమంత్రి
  • నాయకులకు మార్కులు వేస్తే నాకంటే జగ్గారెడ్డికే ఎక్కువొస్తాయని వెల్లడి
  • ఆయన్ను ఓడించడం సంగారెడ్డి ప్రజల దురదృష్టమంటూ వ్యాఖ్య
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చించినా జగ్గారెడ్డి వంటి నాయకుడు దొరకరని ఆయన వ్యాఖ్యానించారు. ఇవాళ సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని శ్రీరాముడు అనుకుంటే, జగ్గారెడ్డి ఆయనకు హనుమంతుడి వంటి వారని అభివర్ణించారు. "నాయకులకు మార్కులు వేస్తే నాకంటే జగ్గారెడ్డికే ఎక్కువ వస్తాయి. అలాంటి నాయకుడిని ఓడించడం ఈ ప్రాంత ప్రజల దురదృష్టం" అని సంగారెడ్డి ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ జగ్గారెడ్డి నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి కొనియాడారు. "కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడు ఆయన. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్న, జగ్గారెడ్డి కచ్చితంగా ప్రజా జీవితంలోనే ఉండాలి" అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Revanth ReddyJagga ReddySangareddyTelangana PoliticsSmart Ration CardsRahul Gandhi

More Telugu News

ఆయిల్ ధరలు, ఇరాన్ దూకుడు.. అన్నింటికీ డెమోక్రాట్లే కారణం: ట్రంప్

23 Nov, 08:43

పల్నాడులో భారీ హింసకు ప్లాన్.. బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు అరెస్ట్.. మొత్తం 66 మందిపై కేసులు

23 Nov, 08:39

ఆ స‌మ‌యంలో నాతో ఏ ఒక్క‌రైనా నిలబ‌డి ఉంటే.. నేనే మ్యాచ్ ముగించే వాడిని: కెప్టెన్‌ తిల‌క్ వ‌ర్మ‌

23 Nov, 08:15

తొలి టెస్టుపై భారత్ పట్టు.. విజయం దిశగా టీమిండియా

23 Nov, 08:13

బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందా?.. విశ్లేషకులు ఏమంటున్నారంటే!

23 Nov, 08:06

ఫుడ్ డెలివరీ కోసం రోజూ 100 కి.మీ. సైకిల్ తొక్కిన యువకుడు.. ఇప్పుడు సీఏ

23 Nov, 07:59

విదేశీ ఉపాధిలో తెలంగాణ టామ్‌కామ్ రికార్డ్.. 15 వేల మందికి కొలువులు!

23 Nov, 07:57

రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండే రోజులే గడువు!

23 Nov, 07:40

అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 258 స్థానాలు.. 1992 తర్వాత అతిపెద్ద విజయం

23 Nov, 07:18

ఒక్కడి పట్టుదల.. 8 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు ముంబై మెట్రోకు లైన్ క్లియర్

23 Nov, 07:15

రోజూ అన్నం పెట్టిన వృద్ధుడి అంతిమయాత్రలో వీధి కుక్క.. శ్మశానంలో మౌనంగా కూర్చున్న 'కాలు'

23 Nov, 07:01

జెప్టోకు తొలుత వచ్చినవి 31 ఆర్డర్లే.. మూతపడే పరిస్థితి నుంచి ఎలా ఎదిగిందో చెప్పిన సహ వ్యవస్థాపకుడు

23 Nov, 06:54

డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం... అమెరికాలో 3,500 విమానాలు ఆలస్యం

23 Nov, 06:50

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీ!

23 Nov, 06:40

తిలక్ వర్మ అద్భుత సెంచరీ.. అయినా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఓటమి

23 Nov, 06:34
..More Telugu News