రూ.75 కోట్ల లగ్జరీ యాట్ నాలుగు రోజులకే మునిగిపోయింది!
- ఇటలీ తీరంలో ఇంజిన్ ఫెయిల్యూర్‌తో అగ్నిప్రమాదం
- నౌకలోని 14 మంది అతిథులు, సిబ్బంది సురక్షితం
- సుమారు రూ.75 కోట్ల విలువైన నౌక సముద్రంలోకి
- ఘటనపై ఇటలీ కోస్ట్ గార్డ్ దర్యాప్తు ప్రారంభం
ఎన్నో ఆశలతో కొనుక్కున్న అత్యంత ఖరీదైన లగ్జరీ యాట్ (విలాసవంతమైన పడవ), యజమానికి చేరిన నాలుగే రోజులకే సముద్రంలో జలసమాధి అయింది. సుమారు 9.1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.75 కోట్లు) విలువైన ఈ నౌక, ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తి మంటలు రేగాయి. ఎలాగో మంటలు ఆర్పినప్పటికీ, ఆ పడవ మధ్యధరా సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన ఇటలీలోని సార్డీనియా తీరంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో నౌకలో 14 మంది ఉన్నప్పటికీ, వారందరూ సురక్షితంగా బయటపడటంతో పెను విషాదం తప్పింది.
వివరాల్లోకి వెళితే, ఇటలీకి చెందిన ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ పెర్మారే (Permare) నిర్మించిన 'అంగియోలా-2' అనే 98 అడుగుల అమెర్ F100 మోడల్ యాట్‌ను ఇటీవలే ఓ ఇటాలియన్ వ్యాపారవేత్త కొనుగోలు చేశారు. మంగళవారం నాడు ఆ నౌకలో 14 మంది అతిథులు, సిబ్బందితో కలిసి ఆయన సార్డీనియాలోని పోర్టో సెర్వో తీరంలో విహారానికి వెళ్లారు. ప్రయాణం మధ్యలో నౌక ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. కొద్దిసేపటికే మంటలు చెలరేగి నౌక మొత్తం వ్యాపించాయి.
ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే సహాయం కోసం అభ్యర్థించారు. మంటల కారణంగా నౌకలోకి భారీగా నీరు చేరడంతో అది ఒక పక్కకు ఒరిగి నెమ్మదిగా సముద్రంలోకి మునిగిపోవడం ప్రారంభించింది. ఈ దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. దగ్గరలో ఉన్న మరో నౌక సిబ్బంది వెంటనే స్పందించి, ప్రమాదంలో చిక్కుకున్న 14 మందిని సురక్షితంగా కాపాడారు. అందరినీ కాపాడిన తర్వాతే యజమాని చివరి వ్యక్తిగా నౌకను వీడినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ నౌక శిథిలాలు సుమారు 23 అడుగుల లోతులో సముద్ర గర్భంలో ఉన్నాయి. ఇటలీ కోస్ట్ గార్డ్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, నౌక నుంచి ఎలాంటి ఇంధనం లీక్ కాలేదని నిర్ధారించారు. శిథిలాలను బయటకు తీసేందుకు 220 టన్నుల బరువున్న భారీ పాంటూన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇంజిన్ ఫెయిల్యూర్, అగ్నిప్రమాదం, నౌక మునిగిపోవడానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ లగ్జరీ యాట్‌లో ఐదు క్యాబిన్లలో 10 మంది అతిథులు, ఐదుగురు సిబ్బంది ప్రయాణించే సౌకర్యం ఉంది. ఇది గరిష్ఠంగా గంటకు 28 నాట్ల (52 కి.మీ) వేగంతో ప్రయాణించగలదు.