గంజాయి ముఠాతో పోలీసుల చెట్టపట్టాల్.. బాలానగర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Telangana
Advertisement
  • బాలానగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ముఠాపై ఈగల్ పోలీసుల దాడి
  • పోలీసులపై కుక్కలను ఉసిగొల్పి స్క్రూడ్రైవర్‌తో దాడి చేసిన నిందితులు
  • నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు, 14.5 కిలోల గంజాయి స్వాధీనం
  • గంజాయి ముఠాతో స్థానిక పోలీసులకు సంబంధాలు ఉన్నట్లు వెల్లడి
హైదరాబాద్‌లోని బాలానగర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఓ ముఠాను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై నిందితులు ఎదురుదాడికి దిగారు. కుక్కలను ఉసిగొల్పి, స్క్రూడ్రైవర్‌తో దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో తెలంగాణ ఈగల్ పోలీసులు సినీ ఫక్కీలో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠాతో స్థానిక పోలీసులకు దగ్గరి సంబంధాలు ఉన్నట్టు  తేలడం సంచలనం రేపుతోంది.

ఏపీలోని పాడేరుకు చెందిన ముగ్గురు అన్నదమ్ములు బాలానగర్‌ను కేంద్రంగా చేసుకుని గంజాయి దందా నడుపుతున్నారు. క్యాటరింగ్ ముసుగులో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి తెచ్చి వాట్సప్ ద్వారా విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో ఈగల్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి నిందితుల ఇంటిపై దాడి చేశారు. పోలీసులను గమనించిన నిందితులు వారిపైకి కుక్కలను వదిలారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ గాయపడ్డారు.

ఇంతలో కిరణ్ అనే నిందితుడు ఓ ఇన్‌స్పెక్టర్‌ను స్క్రూడ్రైవర్‌తో పొడిచి భవనాలపైకి దూకుతూ పారిపోయే ప్రయత్నం చేశాడు. మూడంతస్తుల అపార్ట్‌మెంట్‌పైకి ఎక్కి, సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కిందకు దూకడంతో గాయపడిన అతడిని పోలీసులు పట్టుకుని ఆసుపత్రికి తరలించారు. అతడి భార్య హారికను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 14.5 కిలోల గంజాయి, ఒక ఎయిర్ గన్ స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో గంజాయి ముఠాతో బాలానగర్ ఠాణాకు చెందిన ఓ ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లకు సంబంధాలున్నట్లు తేలింది. ఈగల్ పోలీసుల దాడికి కొన్ని నిమిషాల ముందే ఓ కానిస్టేబుల్ నిందితుల ఇంటికి వచ్చి వెళ్లినట్లు గుర్తించారు. నిందితుల ఇంట్లో పోలీసులకు చెందిన వైర్‌లెస్ సెట్ పరికరం (మ్యాన్‌ప్యాక్) కూడా లభించడం కలకలం రేపుతోంది. ఈ ముఠాకు 200 మందికి పైగా కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 100 మందిని గుర్తించి అదుపులోకి తీసుకుని పరీక్షించగా వారిలో 72 మందికి పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Balanagar Ganja GangHyderabad PoliceTelangana Eagle PoliceGanja Smuggling HyderabadPolice Criminal NexusPaderu Ganja Supply

More Telugu News

ఆయిల్ ధరలు, ఇరాన్ దూకుడు.. అన్నింటికీ డెమోక్రాట్లే కారణం: ట్రంప్

23 Nov, 08:43

పల్నాడులో భారీ హింసకు ప్లాన్.. బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు అరెస్ట్.. మొత్తం 66 మందిపై కేసులు

23 Nov, 08:39

ఆ స‌మ‌యంలో నాతో ఏ ఒక్క‌రైనా నిలబ‌డి ఉంటే.. నేనే మ్యాచ్ ముగించే వాడిని: కెప్టెన్‌ తిల‌క్ వ‌ర్మ‌

23 Nov, 08:15

తొలి టెస్టుపై భారత్ పట్టు.. విజయం దిశగా టీమిండియా

23 Nov, 08:13

బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందా?.. విశ్లేషకులు ఏమంటున్నారంటే!

23 Nov, 08:06

ఫుడ్ డెలివరీ కోసం రోజూ 100 కి.మీ. సైకిల్ తొక్కిన యువకుడు.. ఇప్పుడు సీఏ

23 Nov, 07:59

విదేశీ ఉపాధిలో తెలంగాణ టామ్‌కామ్ రికార్డ్.. 15 వేల మందికి కొలువులు!

23 Nov, 07:57

రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండే రోజులే గడువు!

23 Nov, 07:40

అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 258 స్థానాలు.. 1992 తర్వాత అతిపెద్ద విజయం

23 Nov, 07:18

ఒక్కడి పట్టుదల.. 8 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు ముంబై మెట్రోకు లైన్ క్లియర్

23 Nov, 07:15

రోజూ అన్నం పెట్టిన వృద్ధుడి అంతిమయాత్రలో వీధి కుక్క.. శ్మశానంలో మౌనంగా కూర్చున్న 'కాలు'

23 Nov, 07:01

జెప్టోకు తొలుత వచ్చినవి 31 ఆర్డర్లే.. మూతపడే పరిస్థితి నుంచి ఎలా ఎదిగిందో చెప్పిన సహ వ్యవస్థాపకుడు

23 Nov, 06:54

డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం... అమెరికాలో 3,500 విమానాలు ఆలస్యం

23 Nov, 06:50

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీ!

23 Nov, 06:40

తిలక్ వర్మ అద్భుత సెంచరీ.. అయినా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఓటమి

23 Nov, 06:34
..More Telugu News