అగాధం నుంచి అభివృద్ధి వైపు.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు వివరణ
- గత రెండేళ్లలో సంక్షేమానికి రూ.1.49 లక్షల కోట్లు, అభివృద్ధికి రూ.1.34 లక్షల కోట్లు ఖర్చు
- గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు చర్యలు
- రుణాల రీ-షెడ్యూల్ ద్వారా ప్రభుత్వానికి రూ.8,269 కోట్ల మేర ఆదా
- వైసీపీ పాలనలో రాష్ట్రం రూ.6.94 లక్షల కోట్ల జీఎస్డీపీ నష్టపోయిందని వెల్లడి
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం నుంచి ప్రగతి పథం వైపు నడిపిస్తున్నామని, గత రెండేళ్లలో తీసుకున్న పటిష్ట చర్యలతో రాష్ట్రం అగాధం నుంచి అభివృద్ధి వైపు ప్రయాణిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేపట్టిన దిద్దుబాటు చర్యలను వివరిస్తూ ఆయన మంగళవారం 46 పేజీల ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా గత రెండేళ్ల కాలంలో సంక్షేమానికి రూ.1,49,401 కోట్లు, అభివృద్ధి కార్యక్రమాలకు రూ.1,33,917 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్ లెక్కలు, ఆర్థిక గణాంకాలు బ్రహ్మ పదార్థం కాదని, ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ నివేదికను ప్రజల ముందు ఉంచుతున్నామని అన్నారు. "ఇంట్లో ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు ఎలా చేస్తామో, రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని కూడా అంతే జాగ్రత్తగా అభివృద్ధి, సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాం" అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర విభజన నాటి కష్టాల నుంచి రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించామో, 2019 తర్వాత పాలనలో జరిగిన విధ్వంసం, తిరిగి అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంస్కరణలను సోదాహరణంగా వివరించారు.
గత ప్రభుత్వ తప్పిదాలు.. ఆర్థిక నష్టం
వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు దారుణంగా మందగించిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో సగటున 13.5% జీఎస్డీపీ వృద్ధిరేటు సాధిస్తే, 2019-24 మధ్య అది 10.30 శాతానికి పడిపోయిందని తెలిపారు. ఈ వృద్ధిరేటును కొనసాగించకపోవడం వల్ల రాష్ట్రం రూ.6.94 లక్షల కోట్ల మేర జీఎస్డీపీని నష్టపోయిందని లెక్కలతో సహా వివరించారు.
ఇదే సమయంలో తెలంగాణతో తలసరి ఆదాయంలో వ్యత్యాసం భారీగా పెరిగిపోయిందని, 2018-19లో రూ.55,817గా ఉన్న ఈ గ్యాప్, 2023-24 నాటికి రూ.1,06,854కు పెరిగిందని పేర్కొన్నారు. సరైన ప్రణాళికతో ముందుకెళ్లి ఉంటే, 2025-26 నాటికి ఏపీ తలసరి ఆదాయం రూ.3,67,115గా ఉండేదని, కానీ గత ప్రభుత్వ విధానాల వల్ల అది రూ.2,94,507కే పరిమితమైందని, తద్వారా ప్రతి వ్యక్తి రూ.72,608 మేర ఆదాయాన్ని కోల్పోయారని విశ్లేషించారు.
దిద్దుబాటు చర్యలు.. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్
2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉన్న రూ.48,616 కోట్ల పెండింగ్ బిల్లులకు గానూ, ఇప్పటికే రూ.19,357 కోట్లు చెల్లించినట్లు సీఎం వెల్లడించారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ, సీపీఎస్, పీఎఫ్ వంటి బకాయిల్లో రూ.30,849 కోట్లకు మోక్షం కల్పించినట్లు తెలిపారు.
అదేవిధంగా, గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన 86 కేంద్ర ప్రాయోజిత పథకాల పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నామని, ఇందుకోసం పెండింగ్‌లో ఉన్న రూ.8,695 కోట్లను కేంద్రానికి జమ చేసి, వినియోగ ధ్రువపత్రాలు (యూసీలు) సమర్పించామని చెప్పారు. దీని ఫలితంగా రాష్ట్రంలో రూ.45,138 కోట్ల అభివృద్ధి పనులు సాధ్యపడగా, ఇందులో కేంద్రం వాటాగా రూ.29,890 కోట్లు అందిందని వివరించారు. స్థానిక సంస్థలకు చెల్లించకుండా నిలిపివేసిన ఆర్థిక సంఘం నిధులను కూడా విడుదల చేశామని, పెండింగ్ బిల్లులతో కలిపి మొత్తంగా రూ.7,404 కోట్లను స్థానిక సంస్థలు, వైద్యారోగ్య రంగానికి బదలాయించామని తెలిపారు.
రుణాల భారం తగ్గింపు.. భారీ ఆదా
అధిక వడ్డీలకు తీసుకున్న అప్పుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రుణాల రీ-షెడ్యూల్‌పై దృష్టి సారించిందని చంద్రబాబు తెలిపారు. రూ.1.50 లక్షల కోట్ల విలువైన 370 రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించేలా బ్యాంకర్లతో చర్చలు జరిపి విజయం సాధించామన్నారు. 13% వడ్డీ ఉన్న రుణాలను 10.90 శాతానికి, 9.9% వడ్డీ ఉన్నవాటిని 9.1 శాతానికి, 8% వడ్డీ ఉన్న రుణాలను 7.7 శాతానికి తగ్గించామన్నారు. ఈ చర్యల ద్వారా ఏటా రూ.1,100 కోట్లు ఆదా అవుతోందని, మొత్తం మీద ప్రభుత్వానికి రూ.8,269 కోట్ల మేర ఆదా అయిందని పేర్కొన్నారు.
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం
గత రెండేళ్లలో సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ఈ కాలంలో వివిధ పథకాల ద్వారా రూ.1,49,401 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
ఎన్టీఆర్ భరోసా – రూ.68,296 కోట్లు
విద్యుత్ సబ్సిడీ – రూ.32,800 కోట్లు
తల్లికి వందనం – రూ.20,210 కోట్లు
అన్నదాత సుఖీభవ – రూ.8,724 కోట్లు
ఎన్టీఆర్ వైద్యసేవ – రూ.5,921 కోట్లు
బియ్యం సబ్సిడీ – రూ.4,322 కోట్లు
దీపం 2.0 – రూ.3,724 కోట్లు
ఫీజు రీయింబర్స్మెంట్ – రూ.1,529 కోట్లు
స్త్రీశక్తి – రూ.1,520 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి – రూ.1,200 కోట్లు
వీటితో పాటు ఉద్యోగాల భర్తీపైనా దృష్టి సారించామని, ఇప్పటికే 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, మెగా డీఎస్సీ-2025 ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టులు, 5,757 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నామని ప్రకటించారు.
అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో మూలధన వ్యయాన్ని పెంచడం ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యమని చంద్రబాబు అన్నారు. గత రెండేళ్ల సగటు మూలధన వ్యయం, 2019-24 మధ్య సగటు వ్యయంతో పోలిస్తే 1.5 రెట్లు అధికమని తెలిపారు.
అమరావతి రాజధాని పనులకు (2024-26) – రూ.10,057 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు – రూ.8,323 కోట్లు
పోర్టులకు – రూ.5,437 కోట్లు
రైల్వేల అభివృద్ధికి – రూ.64,417 కోట్లు
జాతీయ రహదారులకు – రూ.38,800 కోట్లు
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో రూ.1.78 లక్షల కోట్లతో 390 ప్రాజెక్టుల అమలుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, వీటికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద చేయూతనిస్తామని సీఎం వివరించారు. ఇప్పటికే 10 పీపీపీ ప్రాజెక్టులకు రూ.1850 కోట్ల వీజీఎఫ్ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు.
ఆదాయం-జీతాల వ్యయంపై విశ్లేషణ
2014-19 మధ్య రాష్ట్ర ఆదాయంలో 87% జీతాలకు ఖర్చు కాగా, 2019-24 మధ్య ఆదాయాలు పడిపోయి, జీతాల ఖర్చు 110 శాతానికి చేరిందని, అందుకే గత ప్రభుత్వం జీతాలు కూడా సరిగా చెల్లించలేకపోయిందని చంద్రబాబు విమర్శించారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో ఆదాయం పెరిగిందని, ఇప్పుడు వచ్చే ఆదాయంలో 95% నిధులను జీతాలకు చెల్లిస్తున్నామని, భవిష్యత్తులో ఆదాయాన్ని మరింత పెంచి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.