Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫోర్స్‌ మోటార్స్‌ నుంచి అర్బేనియా డీలక్స్‌.. ధర రూ.28.70 లక్షలు

Force Motors Urbania Deluxe premium van price and features
Advertisement
  • 2.6 లీటర్‌ టర్బో డీజిల్‌ ఇంజిన్‌
  • 134 హెచ్‌పీ, 350 ఎన్‌ఎం టార్క్‌
  • 9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే
  • 9+డి నుంచి 16+డి సీటింగ్‌
  • 5 ఏళ్లు/5 లక్షల కి.మీ వారంటీ
Advertisement
ఫోర్స్‌ మోటార్స్‌ భారత మార్కెట్లో కొత్త అర్బేనియా డీలక్స్‌ ప్రీమియం వ్యాన్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.28.70 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఇప్పటికే ఉన్న అర్బేనియా మోడల్‌కు బదులుగా ఈ కొత్త డీలక్స్‌ వెర్షన్‌ను కంపెనీ తీసుకొచ్చింది.

ప్రీమియం షేర్డ్‌ మొబిలిటీ విభాగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ వ్యాన్‌ను మూడు వీల్‌బేస్‌లు, ఎనిమిది సీటింగ్‌ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. 9+డ్రైవర్‌ నుంచి 16+డ్రైవర్‌ సీటింగ్‌ వరకు ఆప్షన్స్‌ ఉండటంతో టూరిజం, ట్రాన్స్‌పోర్ట్‌ రంగాలకు అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

అర్బేనియా డీలక్స్‌లో మెర్సిడెస్‌ టెక్నాలజీ ఆధారిత 2.6 లీటర్ల నాలుగు సిలిండర్ల టర్బో డీజిల్‌ ఇంజిన్‌ను అందించారు. ఇది 134 హెచ్‌పీ శక్తి, 350 ఎన్‌ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. పూర్తిస్థాయి ప్రయాణికులతోనూ మెరుగైన పనితీరును అందించేలా దీన్ని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.

ఇంటీరియర్‌లో లెదరెట్‌ సీట్లు, వుడ్‌ ఫినిష్‌ ఫ్లోరింగ్‌తో పాటు 9 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను అందించారు. స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ నావిగేషన్‌, రివర్స్‌ కెమెరా, వాయిస్‌ అలర్ట్స్‌, హ్యాండ్స్‌ఫ్రీ కాలింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే 16 అంగుళాల అలాయ్‌ వీల్స్‌, పవర్‌ ఆపరేటెడ్‌ స్లైడింగ్‌ ఫుట్‌స్టెప్‌, 8 స్పీకర్ల డిజిటల్‌ థియేటర్‌ సిస్టమ్‌, అన్ని వరుసల్లో యూఎస్‌బీ టైప్‌-ఏ, టైప్‌-సీ ఛార్జింగ్‌ పోర్టులు కూడా ఉన్నాయి.

భద్రత కోసం ప్రతి ప్రయాణికుడికి 3-పాయింట్‌ సీట్‌బెల్ట్‌, డ్రైవర్‌, కో-డ్రైవర్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, ఆల్‌ వీల్‌ డిస్క్‌ బ్రేక్స్‌, ఈఎస్‌పీ, ఏబీఎస్‌, ఈబీడీ, ఇంజిన్‌ డ్రాగ్‌ టార్క్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లను కంపెనీ అందించింది. అదనంగా 5 సంవత్సరాలు లేదా 5 లక్షల కిలోమీటర్ల వారంటీ, 3 ఏళ్ల రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌తో కూడిన ఫోర్స్‌ కేర్‌ ప్యాకేజీను కూడా ప్రకటించింది.
Advertisement
Advertisement
Force Motors Urbania Deluxe
Premium Passenger Van Price
Force Urbania Deluxe Features
Luxury Shared Mobility India
Force Motors New Launch
Commercial Van Specifications

More Telugu News