చర్లపల్లి జైలు నుంచి బండి భగీరథ్ విడుదల
- నిన్న బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
- న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేసి నేడు విడుదల
- కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా కుటుంబ సభ్యులు స్వాగతం
- సాక్షులు ప్రభావితం చేయొద్దని కోర్టు షరతు
- విచారణకు సహకరించాలని ఆదేశం
పోక్సో కేసులో తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో బండి భగీరథ్ చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం విడుదలయ్యారు. హైకోర్టు ఉత్తర్వుల కాపీలు జైలు అధికారులకు అందిన అనంతరం అన్ని న్యాయపరమైన ప్రక్రియలను పూర్తి చేసి ఆయన్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా జైలు వద్దకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌తో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు చేరుకుని భగీరథ్‌కు స్వాగతం పలికారు.
బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు పలు కీలక షరతులు విధించింది. దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరించాలని, సాక్షులను లేదా ఫిర్యాదుదారులను ఎలాంటి ప్రభావానికి గురిచేయరాదని స్పష్టం చేసింది. అలాగే విచారణకు అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.