కొత్త స్టెల్త్ అవతార్‌లో టాటా హారియర్, సఫారీ.. ధరలు, ఫీచర్లు ఇవే!
- 2026 హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్‌లు విడుదల
- టాప్-స్పెక్ వేరియంట్ల ఆధారంగా కొత్త స్టెల్త్ ఎడిషన్‌లను తీసుకొచ్చింది
- ప్రత్యేక బ్లాక్ ఎక్స్‌టీరియర్, ఆల్-బ్లాక్ క్యాబిన్‌తో కొత్త లుక్
- పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు
- హారియర్ ధర రూ.23.43 లక్షలు, సఫారీ రూ.24.09 లక్షల నుంచి ప్రారంభం
టాటా మోటార్స్ తన ప్రీమియం ఎస్‌యూవీ శ్రేణిలో 2026 హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న టాప్ స్పెసిఫికేషన్స్‌తో ఫియర్‌లెస్ అల్ట్రా, అకంప్లిష్డ్ అల్ట్రా వేరియంట్ల ఆధారంగా రూపొందించిన ఈ ప్రత్యేక ఎడిషన్‌లు ఆకర్షణీయమైన బ్లాక్ థీమ్, ప్రీమియం ఇంటీరియర్‌తో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా తీసుకొచ్చింది. ఇంజిన్, పనితీరులో ఎలాంటి మార్పులు చేయకుండా ప్రధానంగా డిజైన్‌పై దృష్టి పెట్టింది.
2026 టాటా హారియర్ స్టెల్త్ ఎడిషన్ ధర రూ.23.43 లక్షల నుంచి రూ.26.01 లక్షల (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంది. సఫారీ స్టెల్త్ ఎడిషన్ ధర రూ.24.09 లక్షల నుంచి రూ.26.76 లక్షల (ఎక్స్‌షోరూమ్) వరకు నిర్ణయించింది. గతంలో పరిమిత సంఖ్యలో స్టెల్త్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన టాటా.. ఈసారి అధికారికంగా రెండు ఎస్‌యూవీ మోడళ్లలోనూ స్టెల్త్ ఎడిషన్‌ను అందిస్తోంది.
స్టెల్త్ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణ స్టెల్త్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ కలర్. 19 అంగుళాల మాటే స్టెల్త్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో పాటు ముందు ఫెండర్‌పై ప్రత్యేక ‘స్టెల్త్’ బ్యాడ్జ్‌ను అమర్చారు. దీంతో డార్క్, రెడ్ డార్క్ ఎడిషన్‌లతో పోలిస్తే ఈ వేరియంట్‌కు మరింత ప్రత్యేకమైన రూపు వచ్చింది.
క్యాబిన్‌లో పూర్తిగా బ్లాక్ థీమ్‌ను అందించారు. కార్బన్ నాయిర్ లెదరెట్ సీట్లు, ప్రత్యేక టెర్రైన్ రెస్పాన్స్ డయల్‌తో ప్రీమియం ఫీల్ కల్పించారు. 14.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 13 స్పీకర్ల జేబీఎల్ డాల్బీ అట్మాస్ ఆడియో సిస్టమ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, లెవల్-2 అడాస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
స్టెల్త్ ఎడిషన్‌లో ఇంజిన్‌లలో ఎలాంటి మార్పులు చేయలేదు. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 170 హెచ్‌పీ శక్తి, 280 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ 170 హెచ్‌పీ పవర్, 350 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. రెండు ఇంజిన్‌లకూ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.