అఖిల్ 'లెనిన్'కు సమంత విషెస్.. వైరల్ అవుతున్న పోస్ట్!

Samantha wishes for Akhil Lenin movie viral post
  • అఖిల్ 'లెనిన్' చిత్రానికి శుభాకాంక్షలు తెలిపిన సమంత
  • 'బ్లాక్‌బస్టర్ వైబ్స్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పోస్ట్
  • ఇటీవలే సమంత సినిమాను ప్రశంసించిన అఖిల్
  • సోషల్ మీడియాలో ఈ పరిణామంపై ఆసక్తికర చర్చ
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నటి సమంత.. అఖిల్‌కు, చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలపడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

'లెనిన్' ట్రైలర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్న సమంత, అఖిల్‌ను ట్యాగ్ చేస్తూ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. ''లెనిన్ చిత్ర బృందానికి, అఖిల్‌కు ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పటికే 'పెద్ద బ్లాక్‌బస్టర్ వైబ్స్' కనిపిస్తున్నాయి'' అని ఆమె పేర్కొన్నారు. సమంత విషెస్ చెప్పడం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

కాగా, ఇటీవలే సమంత నటించిన 'మా ఇంటి బంగారం' సినిమాపై అఖిల్ కూడా ప్రశంసలు కురిపించారు. 'లెనిన్' ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆ సినిమా కాన్సెప్ట్ చాలా ఫ్రెష్‌గా ఉందని, వైబ్ బాగుందని అన్నారు. ఇలా ఒకరి చిత్రాలపై మరొకరు పాజిటివ్‌గా స్పందించుకోవడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మూడేళ్ల విరామం తర్వాత అఖిల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'లెనిన్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టే సినిమాకు మంచి స్పందన లభిస్తుండటంతో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Akhil Akkineni
Samantha Ruth Prabhu
Lenin Movie
Maa Inti Bangaram
Telugu Cinema News
Samantha Instagram Post

More Telugu News