అఖిల్ ఈసారి హిట్ కొట్టడం పక్కా అంటున్న ఫ్యాన్స్!

  • రేపు విడుదలవుతున్న 'లెనిన్'
  • విలేజ్ నేపథ్యంలో నడిచే కథ
  • డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న అఖిల్
  • గ్లామర్ తో కట్టిపడేస్తున్న భాగ్యశ్రీ 
  • అభిమానులలో పెరుగుతున్న అంచనాలు

అఖిల్ తన కెరియర్ ను మొదలుపెట్టి చాలాకాలమే అయింది. అయితే అఖిల్ పై అభిమానులు పెట్టుకున్న అంచలనాలను గత సినిమాలు అందుకోలేకపోయాయి. అఖిల్ మంచి అందగాడు. డాన్స్ .. ఫైట్స్ లోను అఖిల్ కి వంక బెట్టడానికి లేదు. నటన పరంగా కూడా మంచి మార్కులే సంపాదించుకున్నాడు. అయితే అఖిల్ కి తగిన హిట్ మాత్రం ఇంకా ఆయనను వరించలేదనే చెప్పాలి. ఆ సమయం కోసమే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో అఖిల్ చేసిన సినిమానే 'లెనిన్'. సూర్యదేవర నాగవంశీ - నాగార్జున కలిసి నిర్మించిన సినిమా ఇది. మురళీ కిశోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, రేపు థియేటర్లకు రానుంది. ఈ సినిమా నుంచి వదిలిన సాంగ్స్ కీ .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖిల్ - భాగ్యశ్రీ బోర్సే జోడీ మార్కులు కొట్టేసింది. ఇంతవరకూ అఖిల్ చేసిన పాత్రలకు పూర్తి డిఫరెంట్ గా ఉండే పాత్ర కావడం, ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. 

రామాపురం - భారతం మిట్ట అనే రెండు గ్రామాల మధ్య నడిచే కథ ఇది. ఆ గ్రామాలకు చెందిన ఇద్దరు  ప్రేమికుల చుట్టూ పరిగెత్తే కథ ఇది. గ్రామీణ రాజకీయాలు .. అక్కడ ప్రతి ఏడాది జరిగే  జాతర ప్రధానంగా ఈ కథ కొనసాగుతుంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్స్ ఈ కథలో బలంగా కనిపిస్తున్నాయి. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో గతంలో నాగార్జున చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అలాగే అఖిల్ కి కూడా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి పెడుతుందనేది ఫ్యాన్స్ బలంగా చెబుతున్న మాట. 


Akhil Akkineni
Lenin movie
Bhagyashri Borse
Murali Kishore
Naga Vamsi
Nagarjuna

More Telugu News