చాట్‌జీపీటీలో అంతరాయం.. ఆగిపోయిన ఇమేజ్ జనరేషన్ సేవలు
- ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ ఇమేజ్ జనరేషన్ సేవలకు అంతరాయం
- సమస్యను గుర్తించి, పరిష్కరిస్తున్నామని తెలిపిన ఓపెన్ఏఐ
- భారత్‌తో సహా పలు దేశాల్లో యూజర్ల నుంచి ఫిర్యాదుల వెల్లువ
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేదిక చాట్‌జీపీటీలో ఇమేజ్ జనరేషన్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. మంగళవారం వినియోగదారులు ప్రాంప్ట్‌లు నమోదు చేసినప్పటికీ, ఇమేజ్‌లు జనరేట్ కాకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ సమస్యను గుర్తించామని, దీనిని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపడుతున్నామని మాతృసంస్థ ఓపెన్ఏఐ వెల్లడించింది.
ఉదయం నుంచి చాట్‌జీపీటీ ఇమేజ్ జనరేషన్ విభాగంలో అధిక సంఖ్యలో సాంకేతిక లోపాలు తలెత్తినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన ఇంజినీర్లు సమస్యను చక్కదిద్దే ప్రక్రియను ప్రారంభించారు. ఈ అంతరాయం డాల్-ఈ ఆధారిత ఇమేజ్ క్రియేషన్ టూల్స్‌పై ప్రభావం చూపిందని, పరిష్కారానికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నామని పేర్కొంది.
కస్టమ్స్ జీపీటీ, చాట్‌జీపీటీ, ఫెడ్ రాంబ్ కోడెక్స్, ఇమేజ్ జనరేషన్, వర్క్ స్పేస్ అనలటిక్స్, కన్వర్సేషన్ సెర్చ్ వంటి సేవల్లో కూడా సమస్య వచ్చిందని కంపెనీ తెలిపింది. యూజర్ల నుంచి ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. దీనిపై తమ బృందం పని చేస్తోందని పేర్కొంది. ఇప్పటికే చాట్ జీపీటీ సేవలను పునరుద్ధరించామని తెలిపింది. మిగిలిన సేవలను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని కంపెనీ వెల్లడించింది.
ఈ సాంకేతిక సమస్యపై డౌన్‌డెటెక్టర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో వినియోగదారుల నుంచి భారీగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఒక్క భారతదేశంలోనే వందకు పైగా ఫిర్యాదులు నమోదైనట్లు సమాచారం. ఉచిత మరియు ప్రీమియం పెయిడ్ యూజర్లు అందరూ ఈ సమస్యను ఎదుర్కొన్నారు. సర్వర్లపై అధిక ఒత్తిడి లేదా ఇతర సాంకేతిక లోపాల కారణంగా ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు.