అన్షులా కపూర్ పెళ్లి వేడుక: సిందూర ధారణ సమయంలో తోబుట్టువుల బాధ్యత చాటిన జాన్వీ, ఖుషీ!
- వేడుకగా రోహన్, అన్షులాల వివాహం
- ముంబైలో ఆత్మీయుల మధ్య పెళ్లి వేడుక
- ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు పంచుకున్న పెళ్లికూతురు
ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె, నటుడు అర్జున్ కపూర్ సోదరి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అన్షులా కపూర్ తన ప్రియుడు, రచయిత రోహన్ థక్కర్ను వివాహం చేసుకున్నారు. ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్లో సోమవారం (జూలై 6న) వీరి వివాహ వేడుక అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను అన్షులా కపూర్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకోగా, అందులోని ఒక ప్రత్యేకమైన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
పెళ్లి ఆచారాల్లో అత్యంత ముఖ్యమైన సిందూర ధారణ (సిందూర్ దాన్) వేడుక జరుగుతున్న సమయంలో.. అన్షులా కపూర్ సవతి చెల్లెళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ తమ చెల్లెలి బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. వరుడు రోహన్ థక్కర్, వధువు అన్షులా నుదుట సిందూరం దిద్దుతున్న వేళ.. ఆ క్రతువు శాస్త్రోక్తంగా జరిగేలా జాన్వీ, ఖుషీ ఇరువైపులా నిలబడి తమ బావకు (జీజూ) సాయం చేస్తూ కనిపించారు. ఆ క్షణం పెళ్లి ఆల్బమ్లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రైడ్స్మెయిడ్స్గా వారిద్దరూ వ్యవహరించిన తీరు కపూర్ కుటుంబంలోని అనుబంధాన్ని ప్రతిబింబిస్తోందని అభిమానులు మురిసిపోతున్నారు.
పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ అన్షులా తన భర్త కోసం ఒక ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చారు. "ఎందరో వ్యక్తులు, ఎన్నో ప్రదేశాలు, ఎన్నో సమయాలు ఉన్నా.. చివరకు నువ్వే నా వాడివయ్యావు. ప్రతి మలుపు, ఆశ్చర్యాలను దాటుకుని ఇప్పటికీ నువ్వే నా తోడుగా నిలిచావు. నా ఫేవరెట్ సంభాషణ, నా సురక్షితమైన స్థానం, నా అత్యంత సులువైన ఎంపిక ఎప్పుడూ నువ్వే" అని ఆమె పేర్కొన్నారు.
ఈ పెళ్లి వేడుకకు కపూర్ కుటుంబ సభ్యులతో పాటు బాబాయ్ అనిల్ కపూర్ తదితరులు హాజరయ్యారు. పెళ్లికి ముందు జరిగిన మెహందీ, చూడా వేడుకలను కూడా జాన్వీ, ఖుషీ దగ్గరుండి ప్లాన్ చేసి అన్షులాకు మర్చిపోలేని జ్ఞాపకాన్ని అందించారు. 2022లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన అన్షులా, రోహన్ థక్కర్లు జూలై 2025లో నిశ్చితార్థం చేసుకోగా, ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.