కాకినాడ చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కొత్త మలుపు... ఆ కియా కారు ఎవరిది?

Gnaneswari missing case in Kakinada takes new twist as suspicious Kia car surfaces
  • తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కొత్త పరిణామం
  • పాప కనపడకుండా పోయిన రోజున కనిపించిన కియా కారు మళ్లీ ప్రత్యక్షం
  • అదే కారు తమ బంధువును ఢీకొట్టిందని కుటుంబ సభ్యుల ఆరోపణ
  • అనుమానాస్పద కారుపై దృష్టి సారించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో తీవ్ర కలకలం రేపిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు కొత్త మలుపు తిరిగింది. దాదాపు నెల రోజులుగా ఆచూకీ లేకుండా పోయిన ఈ కేసులో, తాజాగా ఓ అనుమానాస్పద కారుపై పోలీసుల దృష్టి పడింది. ఈ పరిణామంతో దర్యాప్తు మరో కోణంలో వేగవంతమైంది.

వివరాల్లోకి వెళితే, సుంకర గణేశ్, భవాని దంపతుల కుమార్తె జ్ఞానేశ్వరి (2) జూన్ 6న వారు పనిచేస్తున్న పామాయిల్ తోటలో ఆడుకుంటూ అదృశ్యమైంది. అప్పటి నుంచి పోలీసులు గాలిస్తున్నా చిన్నారి జాడ తెలియరాలేదు. అయితే, పాప అదృశ్యమైన రోజున ఓ కియా కారు అనుమానాస్పదంగా సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. ఇప్పుడు గత రెండు రోజులుగా అదే కారు మళ్లీ ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండటంతో కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నిన్న నర్సీపట్నం సమీపంలో తమ బంధువుల్లో ఒకరిని అదే కారు ఢీకొట్టిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు, ఈ కొత్త కోణంపై లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. అనుమానిత కారు వివరాలు, దాని కదలికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 
Gnaneswari
Kakinada missing child case
Tuni missing girl
Suspicious Kia car
Andhra Pradesh police investigation
Sunkara Gnaneswari

More Telugu News