ముఖ్యమంత్రి ఆఫీసు ఉండే ఫ్లోర్ కు భోజనం కట్.. రెండేళ్లుగా బిల్లులు చెల్లించని ప్రభుత్వం!

Telangana
Advertisement
  • తెలంగాణ సచివాలయంలో నిలిచిపోయిన క్యాటరింగ్ సేవలు
  • సీఎం, సీఎస్ కార్యాలయాలు ఉండే ఆరో ఫ్లోర్ కు అల్పాహారం, భోజనం సరఫరా బంద్
  • దాదాపు రెండేళ్లుగా కాంట్రాక్టర్‌కు కోట్లలో బిల్లులు పెండింగ్
  • బకాయిలు చెల్లించకపోవడంతో చేతులెత్తేసిన క్యాటరింగ్ నిర్వాహకుడు
Advertisement
తెలంగాణ సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఉండే ఫ్లోర్ కు క్యాటరింగ్ సేవలు నిలిచిపోయాయి. గత రెండేళ్లుగా కాంట్రాక్టర్‌కు సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడంతో ఆయన సరఫరాను నిలిపివేశారు. ఈ పరిణామంతో సచివాలయంలోని ఉన్నతాధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సచివాలయంలోని ఆరో అంతస్తులో ఉండే ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కార్యాలయాల సిబ్బంది పాటు ఇతర ఉన్నతాధికారులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఫలహారాలు అందించే సేవలకు అంతరాయం ఏర్పడింది. పేరుకుపోయిన బకాయిలను కనీసం వాయిదాల పద్ధతిలోనైనా విడుదల చేయాలని కాంట్రాక్టర్ పలుమార్లు విన్నవించినప్పటికీ, అధికారులు స్పందించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ బకాయిలు కోట్ల రూపాయల్లో ఉండటంతో ముడిసరుకులు కొనుగోలు, సిబ్బంది జీతాల చెల్లింపు భారంగా మారి కాంట్రాక్టర్ చేతులెత్తేసినట్లు సమాచారం. రాష్ట్రంలో వివిధ విభాగాలకు చెందిన కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్న ఆందోళనల నడుమ ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వంటి సీనియర్ నేతల హామీతో కాంట్రాక్టర్లు తమ నిరసనలను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికే ఆహార సరఫరా నిలిచిపోవడం గమనార్హం.
Advertisement

సంబంధిత వార్తలు

Telangana CMOTelangana SecretariatCatering service stoppedPending bills Telangana government

More Telugu News

మున్సిపల్ పోలింగ్ చాలావరకు ప్రశాంతం.. నివేదికల తర్వాతే రీపోలింగ్‌పై నిర్ణయం: ఎస్ఈసీ పునేఠా

01 Nov, 18:57

గేట్లు మూసేయండి.. రాప్తాడు ఘటన నేపథ్యంలో నారా లోకేశ్ కీలక ఆదేశాలు

01 Nov, 18:02

ఆ విషయాల్లో మేం ఇంకా మెరుగ్గా ఉండాల్సింది.. న్యూజిలాండ్‌తో ఓటమిపై శ్రేయస్‌

01 Nov, 18:01

‘మూడు రోజుల్లో పూర్తి చేస్తా’ అంటాం.. కానీ వారం దాటుతుంది! దీని వెనుక సైకాలజీ ఏంటో తెలుసా?

01 Nov, 17:44

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో!

01 Nov, 17:36

‘జ్ఞానేశ్‌ కుమార్‌ తర్వాత మీ వంతే మోదీజీ’.. ఢిల్లీ సభలో రాహుల్‌ గాంధీ హెచ్చరిక!

01 Nov, 17:35

రాబోయే 48 గంటలు కీలకం.. బెంగళూరులో రాప్తాడు బాలికను పరామర్శించిన మంత్రి లోకేశ్

01 Nov, 17:09

రాప్తాడు ఘటనతో 'సినిమా'పై చర్చ.. ఆర్జీవీ ఏమన్నాడంటే!

01 Nov, 17:09

ఏపీకి మరో తుపాను ముప్పు.. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు

01 Nov, 16:47

భూగర్భంలో దాక్కున్నా బయటకు లాగుతాం.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు ఖర్గే హెచ్చరిక

01 Nov, 16:46

భారత్‌ బౌలర్లపై విరుచుకుపడ్డ కివీస్‌.. 3-2తో సిరీస్‌ ముగింపు

01 Nov, 16:30

ప్రభుత్వ రంగంలో మొదటిసారి.. గువహటిలో ప్రోటాన్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్

01 Nov, 16:21

నేటితో 53 ఏళ్లు.. ఐశ్వర్యారాయ్‌ డైట్‌ సీక్రెట్‌ ఇదే..!

01 Nov, 16:15

ఇషాన్‌ కిషన్‌ అరుదైన ఘనత.. సూర్యకుమార్‌ రికార్డు తెరమరుగు!

01 Nov, 16:11

పండ్లు తినడంలో ఈ చిన్న మార్పులు చేసుకోండి.. పోషకాలు పుష్కలం!

01 Nov, 15:52
..More Telugu News