ఓటీటీలోకి లీగల్ సస్పెన్స్ థ్రిల్లర్!

Ikka Movie Special
  • హిందీలో రూపొందిన లీగల్ థ్రిల్లర్
  • అడుగడుగునా సస్పెన్స్ తో సాగే కంటెంట్  
  • ప్రధాన పాత్రల్లో సన్నీడియోల్ - అక్షయ్ ఖన్నా
  • కీలకమైన పాత్రలో కనిపించే దియా మీర్జా 
  • జులై 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 

థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ కి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆ థ్రిల్లర్ కి సస్పెన్స్ తోడైతే .. ఆ సస్పెన్స్ ఒక క్రైమ్ తో ముడిపడి ఉంటే .. ఇవన్నీ కలిసి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటే రేకెత్తే ఆసక్తి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అలాంటి ఒక లీగల్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడం కోసం ఆత్రుత పడుతోంది. ఆ థ్రిల్లర్ సినిమా పేరే 'ఇక్కా'. సన్నీడియోల్ .. అక్షయ్ ఖన్నా ప్రధానమైన ప్రధానమైన పోషించిన సినిమా ఇది. 

సిద్ధార్థ్ మల్హోత్రా రూపొందించిన ఈ సినిమా, కోర్టు రూమ్ డ్రామాగా నడుస్తుంది. ప్రముఖ లాయర్ అర్జున్ మెహ్రా పాత్రలో సన్నీ డియోల్ .. హత్యాయత్నం కేసులో నిందితుడైన శౌర్యమన్ పాత్రలో అక్షయ్ ఖన్నా కనిపించనున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రలలో దియా మీర్జా .. తిలోత్తమ .. శిశిర్ శర్మ .. ఆకాంక్ష అలరించనున్నారు. జులై 10వ తేదీ నుంచి ఈ సినిమాను 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ట్రైలర్ ను కూడా వదిలారు.

నగరంలో అర్జున్ మెహ్రాకి లాయర్ గా మంచి పేరు ఉంటుంది. ఆయన ఒక కేసును టేకప్ చేశాడంటే, ఆ కేసు ఓడిపోవడమనేది జరగదనే నమ్మకం అందరిలో ఉంటుంది. అందువలన ఆయనకి ఎదురుగా నిలబడి వాదన చేయడానికి మిగతా లాయర్లు భయపడుతుంటారు. అలాంటి అర్జున్ ను శౌర్యమన్ ఆశ్రయిస్తాడు. తనని ఒక కేసు నుంచి కాపాడమని కోరతాడు. అతను చేసిందేమిటి? ఆ కేసు విషయంలో అర్జున్ కి ఎదురైనా సవాళ్లు ఏమిటి? అనేది మిగతా కథ. ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది చూడాలి మరి. 

Sunny Deol
Akshaye Khanna
Ikka Movie Netflix
Legal Suspense Thriller
Siddharth Malhotra
New OTT Releases July 10

More Telugu News