నేడు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరుకానున్న గుడివాడ అమర్నాథ్
- హోంమంతి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమర్నాథ్
- అనిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్
- అనితపై తాను అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్న అమర్నాథ్
మరోవైపు, హోంమంత్రి అనితపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అమర్నాథ్ వివరణ ఇచ్చారు. తాను ఎక్కడా మహిళలను తక్కువ చేసి మాట్లాడలేదని, ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు సాధారణం అని చెప్పుకొచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించి.. టీడీపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలపై గౌరవంతోనే తాను మహిళా కమిషన్ ముందుకు వస్తున్నట్లు చెప్పారు. గతంలో హోంమంత్రి అనిత.. వైసీపీ నేతలపై, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ పై చేసిన పాత వ్యాఖ్యల తాలూకు వీడియో ఫుటేజ్‌లను కమిషన్ ముందు పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.